వైన్ షాపు లు మూసివేత…ఎందుకో తెలుసా….?

భోనాల పండుగ  సందర్భంగా హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలను బంద్ చేశారు. హైదరాబాద్, రాచకొండ పోలీసుల కమిషనరేట్ పరిధిలో వచ్చే రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను బంద్ చేయాలంటూ పోలీసు కమిషనర్‌లు అంజనీకుమార్, మహేష్‌భగవత్‌లు శుక్రవారం (ఆగస్టు 3) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు నగరంలోని వైన్ షాపు లు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలలో మద్యం అమ్మకాలను నిషేదించారు. 

ఎల్బీనగర్, మల్కాజిగిరి డీసీపీ జోన్‌ల పరిధిలలో నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరపడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మద్యం అమ్మకాలను నిలిపివేయబోతోంది. మరోవైపు బోనాల దృష్ట్యా ముందస్తుగా మద్యం అమ్మకాలు శనివారం భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*