రాజస్థాన్.. ఛత్తీస్‌గఢ్‌.. రెండు రాష్ట్రాల్లో సీఎం కుర్చీ ఎవరిదీ?


రాజస్థాన్..ఛత్తీస్‌గఢ్‌.. రెండు రాష్ట్రాల్లో సీఎం కుర్చీ ఎవరిదీ?అనే దాని పైనే చర్చ సాగుతుంది. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది.అక్కడ ప్రజలు ఏకపక్షమైన తీర్పునిచ్చారు. దీంతో బీజేపీ అడ్రస్సు గల్లంతైంది. ఇంతవరకుబాగానే ఉంది. అయితే ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ 15 ఏళ్ల తర్వాతఅధికారంలోకి వచ్చింది. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులవుతారోసస్పెన్స్‌ గా మారింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేసులో కాంగ్రెస్ పార్టీ ఛీఫ్భూపేష్ బగేల్, రద్దయిన అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న టీఎస్సింగ్ దేవ్, ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎంపీతమ్రాద్వాజ్ సాహూలు ఉన్నారు. ముగ్గురుముఖ్యమంత్రులుగా తమనే ఎందుకు ఎన్నుకోవాలో అనేదానిపై కారణాలు కూడా చూపిస్తున్నారు.అయితే హైకమాండ్ మాత్రం ఎవరికి సీఎం బాధ్యతలు అప్పగించినా 2019 లోక్‌సభ ఎన్నికలకు గ్రౌండ్‌లెవెల్‌లో క్యాడర్‌ను సంసిద్ధత చేయాలనిఆదేశిస్తోంది. శాసనసభాపక్షనేతను కాంగ్రెస్ సంప్రదాయ పద్దతిలో ఎన్నుకుంటుందనిఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఇంఛార్జ్ పీఎల్ పూనియా చెప్పారు.

అందరి కష్టంతోనే పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన కొనియాడారు. గ్రూపులుగా విడిపోయిన వారిని ఒకే తాటికిందకు తీసుకురావడంలో భగేల్ సక్సెస్ అయ్యారు. అంతేకాదు ప్రచారంలో కూడా ప్రత్యర్థుల బలహీనతను బయటపెట్టడంలో సక్సెస్ అయ్యారు. అజిత్ జోగి కాంగ్రెస్ పార్టీని వీడాకా ఆయన వర్గాన్ని బయటకు పంపడంలో కీలక పాత్ర పోషించారు భగేల్. అయితే ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పూనియాతో విబేధించిన కారణంగా ఆయనకు కొంత మైనస్‌గా మారే అవకాశం ఉంది. కొన్ని వీడియోలు కూడా లీక్ అవడం అందులో భగేల్ కాంగ్రెస్ నేతల గురించి మాట్లాడటం వంటివి ఈయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. 

రాజస్థాన్అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా అల్వార్ జిల్లా రామ్‌ఘర్ అసెంబ్లీ స్థానంనుంచి పోటీకి దిగిన బీఎస్పీ అభ్యర్థి లక్ష్మణ్ సింగ్ గుండెపోటుతో మృతి చెందడంతో ఆఎన్నిక వాయిదా పడింది. 199 నియోజకవర్గాలకు పోలింగ్జరిగింది. ఇందులో కాంగ్రెస్, మిత్రపక్షాలు 100 స్థానాలు గెలుచుకుంది. 2013తో పోలిస్తే 79 స్థానాలు ఎక్కువగా వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ కేవలం 13 సీట్లలో గెలిచింది. బీజేపీ 2013లో 163 స్థానాల్లో గెలవగా, ఇప్పుడు 71 స్థానాలకు పరిమితమైంది.


రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి రేసులో పలువురు ఉన్నారు. ఇందులో సచిన్పైలట్ వైపు 70 శాతం మంది ఎమ్మెల్యేలు మొగ్గుచూపుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ఇక్కడి నుంచి మూడుసార్లుసీఎంగా పని చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా సచిన్ పైలట్ ఉన్నారు. వీరిద్దరుప్రధానంగా రేసులో ఉన్నారు.

 అయితే పార్టీ చాలా తక్కువ మార్జిన్‌తో గెలిచినందున రాష్ట్ర పగ్గాలు అశోక్‌ గెహ్లాట్‌కు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సచిన్‌ పైలట్‌ అయిదేళ్లుగా పార్టీ బాధ్యతలు తీసుకుని ముందుకు నడిపిస్తున్నప్పటికీ ఆయనకు సీఎం పదవి దక్కకపోవచ్చని కూడా వాదనలు వినిపించాయి. ఇరువురు నేతలు సీఎం రేసులో ఉన్నప్పటికీ మొదటి నుంచి సమన్వయంతో ముందుకు నడిచారు. నిన్న ఫలితాలు వెలుడిన తర్వాత కూడా అశోక్ గెహ్లాట్ సచిన్‌ పైలట్‌ ఇంటికి వెళ్లారు. ఇద్దరు కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రచారం సమయంలోనూ కలిసి మెలిసి ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానిపై కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో దాదాపు 70 శాతం మంది సచిన్ పైలట్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*