ఎవరు కీలకపాత్ర చేయనున్నారు.. అనుష్కనా… నాని నా……!

తాజాగా వచ్చిన వార్తల్లో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించే తరువాతి సినిమా ఎప్పుడు ఖరారవుతుందో ఎప్పుడు ఆ సినిమా వివరాలు బయటికొస్తాయో తెలియదు కానీ ఆ సినిమా గురించి మాత్రం  ఏదో ఒక విషయం బయటికి వస్తూనే ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఆయన సినిమా చేయడమనేది మాత్రం ఖాయం. అయితే ఎవరితో అన్నది మాత్రం ఇంకా ఇప్పటిదాకా అధికారిక ప్రకటన రాలేదు. ఆయనైతే యువ హీరోల్ని దృష్టిలో ఉంచుకొని కథ సిద్ధం చేసుకొన్నాడట. అయితే ఒకసారి నితిన్ తో ఆ సినిమా ఉంటుందన్నారు. అంతలోనే  లేదు లేదు నానితో అన్నట్లు వార్తలు బయటికి వచ్చాయి.

లేటెస్ట్ గా వచ్చిన సమాచారం మేరకు మాత్రం దాదాపుగా నానితోనే ఆ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. అటు ఏలేటికీ ఇటు నానికీ  మైత్రీ సంస్థ  ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చేసింది. ఆ రకంగా చూస్తే నాని ఏలేటి కాంబినేషన్ కుదరడమనేదే ఒక ఆసక్తికరమైన విషయమైతే, ఇప్పుడు ఇంకొక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.  నాని సినిమాలో అనుష్క కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తుందని సమాచారం. ఇది మరింత ఆసక్తిని పెంచుతున్న విషయం అయితే, పరిశ్రమలో మాత్రం కొద్దిమంది ఏలేటి తయారు చేసిన స్క్రిప్ట్ అనుష్క కోసం మాత్రమే అని నాని అందులో ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడని చెప్పుకొంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాని అలాంటి సినిమా చేసే అవకాశమే లేదనీ నాని హీరోగానే  కనిపించబోతున్నాడని మరికొందరు అంటున్నారు.  అసలు విషయం ఏమిటో మరికొన్నాళ్లు ఆగితే బయటికొస్తుంది. ప్రస్తుతానికి ఈ కాంబో మాత్రం సినీ ప్రేక్షకుల్లో  కావలసినంత ఆసక్తిని పెంచుతోది. మరి దాని కోసం వేచి చూడాల్సిందే.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*