పోలింగ్ తర్వాత లగడపాటి సర్వే ఏం చెప్తుంది…!తెలంగాణ

పోలింగ్ తర్వాత లగడపాటి సర్వే ఏం చెప్తుంది…!తెలంగాణలో ప్రజాకూటమికే మొగ్గు ఉందని ఎన్నికల ముందు కీలక వ్యాఖ్యలు చేసిన లగడపాటి ఎన్నికల ముగిసిన తర్వాత తన సర్వే పూర్తి ఫలితాలను వెల్లడించారు. తెలంగాణ ఎన్నికల ముగిశాయి., టైమ్స్ నౌ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీఆర్ఎస్ తిరిగి అధికారాన్ని చేపట్టనుంది. ఇతర ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు ఇదే విషయాన్ని తెలిపాయి. టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే, యాక్సిస్ సర్వేల్లో తేలింది. ఇవన్నీ ఒక ఎత్తైతే.. అందరి దృష్టి లగడపాటి రాజగోపాల్ సర్వేపైనే ఉంది. ప్రజా కూటమికే మొగ్గు ఉందని ఎన్నికల ముందు లగడపాటి చేసిన వ్యాఖ్యలు సంచలనమైన నేపథ్యంలో ఎన్నికలు ముగిశాక ఆయన ఏ పార్టీ గెలుస్తుందని చెబుతారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఓటింగ్ శాతం దాదాపుగా 72 శాతం నమోదైందని ఆయన తెలిపారు. పార్టీలు పోటాపోటీగా భారీ స్థాయిలో ధనాన్ని వెచ్చించాయని ఆయన చెప్పారు.

 

 

స్వంతంత్రులు ఏడుగురు (+/-2), బీజేపీ 7(+/-2), టీడీపీ 7 (+/-2), ప్రజా కూటమి 65 స్థానాలు ((+/-10) గెలుస్తుందని లగడపాటి అంచనా వేశారు. టీఆర్ఎస్ 35 ((+/-10) సీట్లు సాధిస్తుందన్నారు. అనేక ప్రలోభాలు, నమ్మకాలు  ఇలా చాలా ఈ ఎన్నికలను ప్రభావితం చేశాయన్నారు. ఎంఐఎం 6-7 సీట్లు, బీఎల్ఎఫ్ ఒక్క చోట గెలుస్తాయని లగడపాటి అంచనా వేశారు. టీడీపీ, కాంగ్రెస్ జట్టు కట్టడంతో.. జిల్లాల్లో హస్తం పార్టీకే మొగ్గు ఉందని లగడపాటి గతంలో అభిప్రాయపడ్డారు. కానీ పోలింగ్ శాతాన్ని బట్టి ఫలితం మారొచ్చన్నారు. పోలింగ్ శాతం పెరిగితే కూటమి గెలుస్తుందని, తగ్గితే హంగ్ రావచ్చన్నారు. తమ సర్వే బృందం 119 స్థానాలకు గాను 100 స్థానాల్లో సర్వే చేయగలిగిందన్న లగడపాటి ప్రతి నియోజకవర్గానికి 1200 నుంచి 2వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించామని తెలిపారు.

 

 

 ఎన్నికలు ముగిశాక లగడపాటి ఏ పార్టీ గెలుస్తుందని చెప్పారంటే ఎన్నికల ముందు లగడపాటి వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్‌లో అత్యధిక సీట్లు ఎంఐఎంకు వెళతాయి. మిగతా స్థానాలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు దక్కుతాయి. వరంగల్, నిజామాబాద్, మెదక్‌లో టీఆర్ఎస్; ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజాకూటమి ఆధిక్యంలో ఉంటాయి. కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో హోరాహోరీ తప్పదు. గత ఎన్నికల తరహాలోనే పోలింగ్ శాతం 68.5 నమోదైతే తన సర్వే అంచనాలు నిజమవుతాయని వ్యక్తం చేశారు.

 

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*