ఐటంసాంగ్ చేయనున్న రకుల్….ఏ మూవీ లోనో తెలిస్తే షాక్……!

 

తాజాగా ఎన్టీర్ బయోపిక్ చిత్రం నిర్మించడం గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్‌లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమాలోకి మరో స్టార్‌ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే ఈ చిత్రంలో నందమూరి బాల‌కృష్ణ‌తో పాటు విద్యాబాలన్, మోహన్‌ బాబు, రానా, కీర్తి సురేష్ మొదలగు తదితరులు నటిస్తుండగా తాజాగా ఈ జాబితాలోకి స్టార్ హీరోయిన్ అయిన రకుల్‌ ప్రీతి సింగ్ పేరు కూడా చేరింది. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే మొదలైందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా మీద అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమాలోని కొన్ని ముఖ్యకీలక సన్నివేశంలో రానున్న పాట కోసం చిత్ర యూనిట్ రకుల్‌ ప్రీతి సింగ్‌ని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. సుదీర్ఘ సినీ కెరియర్ లో ఎన్టీర్ సినిమాల్లోని చాలా ఐటెమ్‌ సాంగ్స్ సూపర్‌ డూపర్ హిట్‌గా నిలిచాయి. దీంతో  వీటిల్లో ఏ పాటని రకుల్‌ ప్రీతి సింగ్ కోసం ఈ సినిమాలో కేటాయించారో సినిమా విడుదల వరకూ సస్పెన్స్ లో ఉంచినట్లు తెలుస్తోంది. అయితే ఏ పాటని చేస్తారనేది కూడా అభిమానుల్లో ఉత్సాహాన్ని రేపుతుంది. ఎక్కువ మంది స్టార్స్‌‌ వచ్చి చేరడంతో ఎన్టీఆర్‌ బయోపిక్ సినిమా‌పై అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఈ చిత్ర యూనిట్ ఆశించిన దానికంటే ప్రమోషన్ అవసరం లేనంత ఎక్కువగా ప్రచారం లభిస్తోంది. అంత మంచి పేరుని, అంతమంది అభిమానుల్ని సంపాదించారాయన. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని నందమూరి అభిమానులే కాదు తెలుగు ప్రజలంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మన ఎన్టీర్ కి మన తెలుగు ప్రజలంతాఎంతో రుణపడి ఉన్నారు. మరి అయితే అందరం జనవరి 9 వరకు వేచి చూడాల్సిందే.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*