అర్జున్ రెడ్డికి రెమ్యునరేషన్ అంతేనా…..!

విజయ్ దేవరకొండకి మంచి పేరు తెచ్చిన మూవీ అర్జున్ రెడ్డికి రెమ్యునరేషన్ అంత తక్కువ. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు విజయ్ దేవరకొండ చిన్న మూవీగా వచ్చి అడల్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సినిమా మొత్తం 4 కోట్ల బడ్జెట్ తో తీస్తే పదిరెట్లు లాభాలు వచ్చిపడ్డాయని చెప్పుకుంటారు. ఈ మూవీ దర్శకుడు సందీప్ వంగ సొంతంగా నిర్మించడంతో బాగానే లాభం పొందాడట. చిత్రం రిమేక్ – డిజిటల్ – శాటిలైట్ హక్కుల అమ్మకం ద్వారా కోట్లు వచ్చాయని ఫిలింనగర్ టాక్. అయితే అర్జున్ రెడ్డి సినిమాకు ముందు విజయ్ ఓ అనామక హీరోనే పెళ్లిచూపులు సినిమాతో అప్పుడే హీరోగా గుర్తింపుపొందాడు. ఇక ఆ తర్వాత అర్జున్ రెడ్డిలో నటించినందుకు గాను  కేవలం రూ.5 లక్షలే తీసుకున్నట్టు విజయ్ తెలిపాడు.

అర్జున్ రెడ్డికి రెమ్యునరేషన్ అంతేనా అని అందరూ ఆశ్చర్యపోయారు.  ఐతే సినిమా రిలీజ్ తర్వాత సినిమాకు భారీ లాభాలు రాబట్టడంతో అందులోంచి తనకు వాటాగా భారీగా మనీ వచ్చిందని వివరించాడు.
విజయ్ ఈ విషయాలను తానే స్వయంగా వెల్లడించాడు. ఇటీవలే ‘రౌడీ’ పేరుతో అపారెల్ బ్రాండ్ ను ఆవిష్కరించిన సందర్భంగా అర్జున్ రెడ్డి పారితోషకం గురించి అడిగితే ఈ సంచలన నిజం చెప్పాడు. విజయ్ అర్జున్ రెడ్డి సినిమాకు కేవలం 5 లక్షలు తీసుకున్నాడని తెలిసి అంతా షాక్ అయ్యారు కానీ, సందీప్ వంగ ఆర్థిక పరిస్థితి చూసే అంత తక్కువ తీసుకున్నానని చెప్పడంతో ఈ హీరో గొప్పతనాన్ని ఇప్పుడు అందరూ పొగుడుతున్నారు. తక్కువ పారితోషకం తీసుకున్నా విజయ్ కి మంచి పేరు రావడం విశేషం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*