విశ్వరూపం2 తెలుగు సినిమా రివ్యూ మరియు రేటింగ్ :

సినిమా పేరు : విశ్వరూపం 2

నటి నటులు : కమల్ హసన్, పూజ కుమార్, అండ్రియా

దర్శకత్వం : కమల్ హసన్

నిర్మాత : కమల్ హసన్, చంద్ర హసన్

సంగీతం : మొహమ్మద్ గిబ్రన్

సినిమాటోగ్రాఫర్ : సాను జాన్ వర్గీస్, శాందత్

విలక్షణ నటుడు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కమల్ హసన్ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో నటించిన చిత్రం విశ్వరూపం ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించిన చిత్రం విశ్వరూపం 2 శుక్రవారం రోజు ప్రేక్షకుల మున్డుకచింది. ఆస్కార్ ఫిలిం (ఫ్రై) లిమిటెడ్ బ్యానర్ లో నిర్మితమైన ఈ చిత్రంలో కమల్ హసన్ సరసన పూజ కుమార్ మరియు అండ్రియా నటించారు. తెలుగు, తమిళ మరియు హిందీ భాషల్లో హాలీవుడ్ ప్రమాణాలతో విడుదల అయిన విశ్వరూపం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో సమిక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

న్యూయార్క్ నగరంపై భయకంకరమైన ఉగ్రదాడిని చేయడంలో విఫలమైన ఓమర్ ఖురేషి (రాహుల్ బోస్) మరో దారుణమైన ఎటాక్‌కు ఇండియా మీద ప్లాన్ చేస్తారు. వీసామ్ (క‌మ‌ల్ హాసన్) ‘రా’ ఏజెంట్. ఇండియాని ఉగ్రవాదుల నుంచి కాపాడే క్రమంలో ఉగ్రవాదులతో మరియు ఒమర్ (రాహుల్ బోస్)తో చేరి వారికి స్నేహితుడిగా నమ్మించి ఉగ్రవాదులు ప్లాన్ లకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటిక‌ప్పుడు ఇండియాలోని తన పై అధికారికి చేరవేస్తుంటాడు.

ఈ క్రమంలో వీసామ్ కు ఎదురయ్యే ఛాలెంజ్ స్ ఏమిటి ? ఓమర్, సలీం ఉగ్రదాడి వ్యూహరచనను విసామ్ ఎలా చిత్తు చేశారు? తనని నమ్మించి మోసం చేసిన వీసామ్ ను ఒమర్ ఎలా అంతం చేయాలనుకున్నాడు ? చివరకి వీసామ్ ఉగ్రవాదులను అంతం చేసాడా లేదా లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

విశ్వరూపం ఎక్కడైతే ముగిసిందో అక్కడినుంచే విశ్వరూపం 2 మొదలైంది. నటన పరంగా కమలహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కేవలం తన నటన కోసమే సినిమాకి వచ్చే అభిమానులను మెప్పించాడు. అంచనాలను అందుకోలేని ఈ చిత్రాన్ని కమల్ తన నటనతో నిలబెట్టే యత్నం చేసాడు.  క కమల్ సరసన హీరోయిన్ గా నటించిన పూజా కుమార్ తన నటన తో పాటు తన గ్లామర్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వారి మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా బాగున్నాయి.

పూజ కుమార్, ఆండ్రియా మరియు రాహుల్ బోస్, శేఖర్ కపూర్ లాంటి మంచి నటినటులు ముఖ్యమైన పాత్రలను పోషించి వారి నటనతో ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్:

నటుడిగా మెప్పించిన కమల్ దర్శకత్వ విభాగంలో పెద్దగా రాణించలేక పోయాడు.గందరగోలమైన కథనంతో సినిమాఫైఆసక్తిని చంపేసారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ స్లో గా సాగడం, కథనంలో క్లారిటీ మిస్ కావడం ఈ సినిమా ఫలితాన్ని పూర్తిగా దెబ్బ తీశాయి.

web2look Rating : 2.25/5

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*