విజయ్ దేవరకొండ వ్యాఖ్య పై.. తారక్ అభిమానుల్లో ఆసక్తికర చర్చ…!

 

విజయ్ దేవరకొండ వ్యాఖ్య పై.. తారక్ అభిమానుల్లో ఆసక్తికర చర్చ…! సక్సెస్ అందివచ్చినప్పుడు దానిని ఖాతాలోకి మళ్లించడం తెలిసి ఉండాలి. యంగ్ ట్యాలెంటెడ్ హీరో .. నైజాం నవాబ్ విజయ్ దేవరకొండ ప్లాన్ అలానే ఉంది మరి. టాలీవుడ్ – కోలీవుడ్ లో క్రేజీ బ్యానర్లకు మాత్రమే ఓకే చెబుతూ తెలివైన ఆట ఆడుతున్న దేవరకొండ.. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో – తమిళనాడులో భారీ ఫ్యాన్ బేస్ ని పెంచుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాడు. తన స్టార్ డమ్ ని.. స్థాయిని ఎలివేట్ చేసే రేంజులో భారీ ఈవెంట్లతో మోత మోగిస్తున్నాడు. `గీత గోవిందం` టైమ్ లో గీతా ఆర్ట్స్ బాస్ అల్లు అరవింద్ – మెగాస్టార్ చిరంజీవి వంటి వారు దేవరకొండకు బోలెడంత ప్రమోషనల్ సాయం చేశారు. ఇప్పుడు `నోటా` సీజన్ రన్ అవుతోంది కాబట్టి విజయ్ కు స్టూడియోగ్రీన్ బాస్ జ్ఞానవేల్ అండా దండా ఇప్పుడు పెద్ద ప్లస్ కానున్నాయి.

దేవరకొండ `ది నోటా పబ్లిక్ మీట్` పేరుతో ప్రమోషనల్ ఈవెంట్ల కోసం సెప్టెంబర్ 30 – అక్టోబర్ 1 ఈ రెండు తేదీల్ని లాక్ చేశాడు. సెప్టెంబర్ 30న విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్ ని బుక్ చేశాడు. ఆరోజు భారీ ఎత్తున దేవరకొండ తెలంగాణ ఫ్యాన్స్ బెంజి సర్కిల్ ని చుట్టుముట్టనున్నారని తెలుస్తోంది. ఏపీలో తడాఖా ఏంటో చూపించడమే ఈ ఈవెంట్ ముఖ్య ఉద్ధేశం. అటుపై అక్టోబర్ 1న హైదరాబాద్- యూసఫ్ గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో భారీ ఈవెంట్ ఉంటుంది. ఈ ఈవెంట్ కోసం ఏకంగా లక్ష మంది అభిమానుల్ని మోహరిస్తున్నారట. మొత్తానికి స్టార్ డమ్ లెవల్ ని చూపించగలిగితే ఆ మేరకు థియేటర్లకు జనాల్ని పుల్ చేయొచ్చనేది ప్లాన్.

 

మరోవైపు తమిళనాడు ప్రమోషన్స్ లోనూ దేవరకొండ దుమ్ము దులిపేస్తున్నాడు. ఇప్పటివరకూ అక్కడే బిజీగా ఉన్నాడు దేవరకొండ. అక్కడ మీడియా ఇంటర్వ్యూలో దేవరకొండకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇటీవలే తారక్ ఫ్యాన్స్ నుంచి నోటా రిలీజ్ విషయంలో హీట్ ని ఎదుర్కొన్నారు కదా?  అన్న ప్రశ్నకు తారక్ అన్న సినిమాతో నా సినిమా రిలీజ్ ని ఫ్యాన్స్ వద్దనడం కరెక్ట్ కాదు. సినిమాల్ని సినిమాలుగానే చూడాలి అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తమిళ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ వ్యాఖ్య పై తారక్ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక అమెరికాలోనూ నోటా ప్రమోషన్స్ హోరెత్తిస్తున్నారు. అక్కడ బే ఏరియాలో ప్రమోషన్స్ కి ప్రత్యేకించి `నోటా ప్రమోషన్ కార్స్` బయల్దేరాయి ఇప్పటికే. ఈ కార్ తో సెల్పీ దిగి 50 డాలర్ల విలువ చేసే గిఫ్ట్ కార్డ్ ని సొంతం చేసుకోవచ్చంటూ ప్రచారం హోరెత్తించేస్తున్నారు. ఇన్ని భారీ అంచనాల నడుమ `నోటా` అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతోంది.  

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*