విజయ్ దేవరకొండతో రోమాన్స్ కి రెడీ అంటున్నా…కాజల్

గత కొన్నిసంవత్సరాలు గా తెలుగు తెరపై సందడి చేస్తున్న సీనియర్ కథానాయిక కాజల్. ఆమెతో పోలిస్తే విజయ్ దేవరకొండ చాలా  జూనియర్. కానీ ఈ ఇద్దరూ కలిసి త్వరలోనే జోడీ కట్టబోతున్నట్టు సమాచారం వచ్చింది.  ఓనమాలు – మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాలతో మంచి దర్శకుడు అనిపించుకొన్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ – కాజల్ జంట కలిసి  నటించబోతున్నట్టు సమాచారం. కథల ఎంపికలో విజయ్ దేవరకొండకి మంచి టేస్ట్ ఉందనే విషయం పెళ్లిచూపులు – అర్జున్ రెడ్డి వంటి చిత్రాలతో తెలిసిపోయింది. తదుపరి ఆయన గీత గోవిందం – టాక్సీవాలా చిత్రాలతో సందడి చేయబోతున్నాడు. ఈ సినిమాల షూటింగ్ కూడా పూర్తయింది. 

 

ఇక తదుపరి విజయ్ నటించే చిత్రం క్రాంతి మాధవ్ దర్శకత్వంలోనే అని తెలుస్తోంది. క్రాంతి మాధవ్ చెప్పిన కథ నచ్చడంతో కథనాయకానాయికలిద్దరూ వెంటనే ఓకే చేశారట. ఈ సినిమాలో కాజల్ని ఎంపిక చేసుకోవడానికి ప్రత్యేకమైన కారణం కూడా ఉన్నట్టు తెలిసింది. మరి అది ఏంటో సినిమా ఆరంభమయ్యాకే తెలిసే  అవకాశం ఉంది. కానీ ఈ చిత్రం మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.  క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు సమాచారం. క్రాంతిమాధవ్ ఇదివరకు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు తీసింది కూడా ఈ సంస్థలోనే.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*