కారుతో మహిళను తొక్కించి మరీ దోపిడి చేసిన దుండగులు….!

కారుతో మహిళను తొక్కించి మరీ దోపిడి చేసిన దుండగులు….! ఓ మహిళ నుంచి నగదు దోపిడి చేయడానికి వచ్చిన దుండగలు.. ఆమెతో దారుణంగా ప్రవర్తించారు. పిడిగుద్దులు గుద్దుతూ.. కాళ్లతో తన్నుతూ ఆమె వద్ద ఉన్న నగదు బ్యాగును లాక్కోడానికి ప్రయత్నించారు. ప్రతిఘటించడంతో ఆమెను కారుతో తొక్కి మరీ బ్యాగు లాక్కొని పరారయ్యారు. ఈ ఘటన టెక్సాస్‌లోని హ్యుస్టన్‌లో చోటు చేసుకుంది. 

టెక్సాస్‌కు చెందిన బాధితురాలు ఆగస్టు 17న జర్సీ గ్రామంలోని ఓ బ్యాంకు నుంచి రూ.75 వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ.52 లక్షలు) విత్‌డ్రా చేసింది. ఈ విషయం తెలుసుకున్న దుండగులు ఆమెను వెంబడించారు. తన ఇంటి ముందు కారు నిలిపి, తలుపు తీస్తుండగా.. ఓ దుండగుడు ఆమెపై దాడిచేసి నగదు బ్యాగ్ లాక్కోడానికి ప్రయత్నించాడు. 

ఈ సందర్భంగా ఆ మహిళకు, దుండగుడికి మధ్య పెనుగులాట జరిగింది. ఆమె అరుపులు విన్న భర్త ఇంటి నుంచి బయటకు వచ్చి.. దుండగుడిని పట్టుకుుని ఆమెను విడిపించాడు. ఇంతలో మరో దుండగుడు కారులో వచ్చి ఆమె భర్తపై దాడి చేసి మొదటి దుండగుడిని విడిపించాడు. ఈ పెనుగులాటలో మహిళ కిందపడిపోయింది. రెండో దుండగుడు ఆమె మీదకు కారు ఎక్కించి మరీ, ఆమె చేతిలో బ్యాగ్గును లాక్కున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. 

ఇదంతా బాధితురాలి ఇంటికి ముందున్న నిఘా కెమేరాలో రికార్డైంది. ఈ సమాచారం తెలియగానే పోలీసులు దుండగులను వెంబడించారు. డెవీస్ డావెల్ మిట్చెల్ అనే నిందితుడిని వెంటనే పట్టుకున్నారు. మరో నిందితుడు ట్రావెన్ జాన్సన్‌ను సోమవారం అరెస్టు చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*