ఐరాసలో ఏపి సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం.. ప్రత్యేక ఆహ్వానం….!

ఐరాసలో ఏపి సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం.. ప్రత్యేక ఆహ్వానం….! ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచ ప్రముఖులతో మంచి స్నేహ సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన అధికారంలో చాలా వరకు అంతర్జాతీయ కంపెనీలతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. తెలుగుదేశం పార్టీని ఓ వైపు సమర్థవంతంగా నడిపిస్తు మరో వైపు పాలనను కొనసాగిస్తు ప్రముఖుల చేత ప్రశంసలు అందుకున్నారు. ఇక ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలు చేసే విమర్శలకు కౌంటర్ ఇస్తూనే ఉంటారు.

అసలు మ్యాటర్ లోకి వస్తే చంద్రబాబు గారికి ఇప్పుడు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ దేశాలన్నీ ఒకే చోట నిలిచే ఐక్యరాజ్య సమితిలో చంద్రన్న మాటలు వినిపించనున్నాయి. చంద్రబాబు ప్రసంగించాల్సిందిగా ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం అందింది. వ్యవసాయ రంగంలో చంద్రబాబు చేస్తున్న కృషిని గుర్తించి ఈ స్పెషల్ ఇన్విటేషన్ ని పంపించారు. ఏపి ప్రభుత్వం జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌ను ఐక్యరాజ్యసమితి తెగ పొగిడేసింది.రానున్న 2024 నాటి కల్లా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మంది రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించడం ఐరాసను ఆకర్షించింది. ఈ ప్రక్రియలో సాయం అందించడానికి ఐరాస కూడా ముందుకువచ్చింది.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*