కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

భూమధ్యరేఖను ఆనుకుని బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. గురువారం ఒక అల్పపీడనం, తర్వాత డిసెంబరు 9న మరోకటి ఏర్పడేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. వీటి ప్రభావం రాబోయే మూడు రోజుల్లో హిందూమహాసముద్రం, బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న దక్షిణాది రాష్ట్రాల తీర ప్రాంతాలపై ఉంటుందని, బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించారు. మత్స్యాకారులు వేటకు వెళ్లరాదని, గురు, శుక్రవారాల్లో కోస్తా, రాయలసీమల్లోని అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఇక, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం వరకు జిల్లాలో 4 సెం.మీ. మేర వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా వర్షాలు కురవడం గమనార్హం. అత్యధికంగా పొదలకూరు మండలంలో 14 సెం.మీ వర్షపాతం నమోదుకాగా.. అత్యల్పంగా తడ మండలంలో 0.6 మి.మీల వర్షం కురిసింది. చెరువుల్లోకి నీరు చేరడంతో రబీ సాగుకు నార్లు పోయడానికి నీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు వర్షాలు ఊరట కలిగిస్తున్నాయి. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*