గజ తుఫానుపై ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

గజ తుఫానుపై ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ, తమిళనాడు తీరం వైపు ‘గజ’ తుఫాను దూసుకొస్తుంది. ఈ గురువారం (నవంబరు 15) సాయంత్రం కడలూరు-పంబన్‌ మధ్య తీరం దాటనుందట. బుధవారం సాయంత్రానికి చెన్నైకు 430 కి.మీ., నాగపట్నానికి 510 కి.మీ. దూరంలో నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ విధంగా పశ్చిమ నైరుతిగా పయనించి తొలుత తీవ్ర తుఫాన్‌గా మారి, ఆ తర్వాత బలహీనపడి తుఫాన్‌గా మారుతుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అలలు ఎగిసిపడుతున్నాయని వాతావరణశాఖ తెలిపింది.

 

ఇప్పుడు ఏపీలో కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ., అప్పుడప్పుడు 65 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని, తుఫాన్‌ తీరం దాటే సమయంలో గాలుల ఉధృతి పెరుగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏపీలోని కృష్ణపట్నం, వాడరేవు, నిజాంపట్నంలలో 3వ ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నం, విశాఖపట్నాలలో 2వ నంబరు ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*