తీరం దాటనున్న పెథాయ్ తుఫాన్.. కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు…!


తీరం దాటనున్న పెథాయ్ తుఫాన్.. కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు…! ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం తుపానుగా మారింది. ఇది శ్రీహ‌రికోట‌కు 720 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృతమైంది. 17న రాత్రి తూర్పుగోదావ‌రి, విశాఖ‌ మ‌ధ్య తీరం దాటే అవ‌కాశం ఉందనివెల్లడించింది. గంట‌కు 16 కిలోమీట‌ర్ల వేగంతో పెథాయ్‌ తుఫాన్‌ క‌దులుతుందని తెలిపింది. తుఫాన్‌గమనాన్ని ఆర్టీజీఎస్‌ అనుక్షణం గ‌మ‌నిస్తుంది. అందువల్ల ఆర్టీజీఎస్‌ అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజలకు నిరంత‌రం హెచ్చరికలుజారీ అవుతున్నట్లు తెలిపింది. ఇది ప్రస్తుతం చెన్నైకి 775 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

అయితే ‘పెథాయ్‌’గా నామకరణం చేసిన ఈ తుపాను ముందస్తు అంచనాల ప్రకారం కళింగపట్నం వద్ద తీరం దాటేఅవకాశం ఉంది. తూర్పుగోదావరి, ఉత్తర కోస్తాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందనిఅంచనా వేస్తున్నారు. ఈ నెల 17 సాయంత్రం పెథాయ్‌ తీరం దాటనుంది. ఈ ప్రభావంతోమరో 24 గంటల్లో కోస్తాంధ్ర అంతటా మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయనివాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అలల ఉద్ధృతి పెరిగే సూచనలు ఉనట్లుఇన్‌కాయిస్‌ హెచ్చరికలు జారీ చేసింది.

పెథాయ్‌ తుపాను నేపథ్యంలో వాతావరణశాఖ అధికారులు కోస్తాంధ్ర జిల్లాలతో పాటు తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశారు. 15న కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడులో కొన్నిచోట్ల భారీ వర్షాలు, 16, 17న కోస్తాలోని పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అలాగే 17వ తేదీ కోస్తాతో పాటు ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు. శనివారం నుంచే కోస్తా తీరంలో గాలుల తీవ్రత ఉంటుందని చెబుతున్నారు. 16వ తేదీ నుంచి గంటకి 80 కి.మీ నుంచి 110 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*