ప్రియా నిక్ ల ప్రేమను శంకిస్తున్న ‘ది కట్ మ్యాగజైన్’?

ప్రియా నిక్ ల ప్రేమను శంకిస్తున్న ‘ది కట్ మ్యాగజైన్’?బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా అంతర్జాతీయ గాయకుడు నిక్ జోనాస్ జంట ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. వివాహ బంధంతో ఒక్కటైన జంటను అందరూ దీవిస్తుంటే ఓ న్యూయార్క్ మ్యాగజైన్ మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేస్తుంది. ప్రియాంక జగమెరిగిన మోసగత్తె అని నిక్ను ఆమె వంచించి పెళ్ళి చేసుకుందంటూ చెత్తనంతా వెళ్లగక్కింది. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ముమ్మాటికీ జాతివివక్షతో కూడిన వ్యాఖ్యలేనంటూ నిరసనలు ప్రారంభం కావడంతో ఆ పత్రిక చివరకు క్షమాపణలు చెప్పింది. ది కట్ మ్యాగజైన్ కి సంబంధించిన వెబ్ సైట్ లో ప్రియాంక నిక్ ది నిజమైన ప్రేమేనా? అనే టైటిల్ తో ఈ కథనం ప్రచురితమైంది.

 

 

అయితే జర్నలిస్ట్ మరియా స్మిత్ రాసిన ఈ కథనంలో అనేక అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయి. పాపం నిక్ కూడా అందరి యువకుల లాగే కాలక్షేపానికి కొద్దిరోజులు ప్రేమాయణం సాగించి వదిలేద్దామనుకున్నాడనీ., కానీ ఆమె జగమెరిగిన మోసగత్తె కాబట్టి కుట్ర పన్ని పెళ్ళి పేరుతో నిక్ ని శాశ్వతంగా కట్టేసుకుని అతనికి యావజ్జీవ శిక్షను విధించింది అంటూ రాసుకొచ్చింది. ఒక ఆసియా మహిళ అమెరికా సినీ టీవీ రంగాల్లో రాణించడాన్ని జీర్ణించుకోలేకే ఇలా విషం వెళ్ళకక్కుతున్నారని బాలీవుడ్ తారలు సోనమ్ కపూర్, స్వరాభాస్కర్, గాయని సోనా మహాపాత్ర విమర్శించారు.

 

 

ఇక నిక్ జోనాస్ సోదరి జోయ్ జోనాస్ ఆమె ప్రియుడు సోఫీ టర్నర్ కూడా ఈ కథనంపై ఘాటుగా స్పందించారు. ఇలాంటి కథనాన్ని ప్రచురించినందుకు ఆ మ్యాగజైన్ సిగ్గుపడాలి అని వారు మండిపడ్డారు. నిరసనలు తీవ్రమవుతుండటంతో ది కట్ దిగివచ్చింది. ఆ కథనాన్ని తొలగిస్తున్నామని క్షమాపణలు చెప్పిందని సమాచారం.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*