తెలంగాణలో సీ ఓటర్ సర్వే సంచలన ఫలితాలు

ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్ నే తృత్వంలోని మహాకూటమి వైపే మొగ్గు ఉందని, టీఆర్ఎస్ కన్నా అధిక స్థానాలు గెలిచే అవకాశం ఉందని రిపబ్లిక్, సీ ఓటర్ సర్వే తెలిపింది. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గానూ మహాకూటమి 8, టీఆర్ఎస్ 7, బీజేపీ, ఏఐఎంఐఎం చెరో స్థానంలో విజయం సాధిస్తాయని అంచనా వేసింది. 2014 ఎన్నికల్లో తెలంగాణలో రెండు లోక్‌సభ స్థానాలు గెలుపొందిన కాంగ్రెస్‌, ఈసారి ఎనిమిదికి పెరుగుతుందని సర్వే తేల్చింది. గత ఎన్నికల్లో 11 ఎంపీలు గెలుపొందిన టీఆర్ఎస్, నాలుగు సీట్లను కోల్పోనుందని అంచనా వేసింది. కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీచేయడం వల్ల 6.7 శాతం ఓట్లు అదనంగా వస్తాయని, ఇదే టైంలో బీజేపీ తన ఓట్ల శాతాన్ని కోల్పోతుందని తెలిపింది. ఎంఐఎం ఓటు బ్యాంకు కూడా 2.5 శాతం మేర పెరుగుతుందని, మహాకూటమికి 32.2 శాతం ఓట్లు, టీఆర్ఎస్ కు 30.4 శాతం ఓట్లు, బీజేపీకి 19 శాతం ఓట్లు, ఏఐఎంఐఎం కు 3.9 శాతం ఓట్లు లభిస్తాయని రిపబ్లిక్, సీ-వోటర్ సర్వే తెలిపింది.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*