తెలంగాణలో నేడు పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

తెలంగాణ‌లో పదోతరగతి పరీక్ష ఫలితాలు సోమవారం (మే 13) విడుదలయ్యాయి. ఉదయం 11.30 గంటలకు సచివాలయం డి-బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. పదోతరగతి పరీక్షలకు మొత్తం 5,52,280 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా.. మొత్తం 5,46, 728 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 5,06,202 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 

www.bse.telangana.gov.in
www.manabadi.com
http://results.cgg.gov.in/

ఈసారి పదోతరగతి ఫలితాల్లో మొత్తం 92.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలికలు 93.68 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 91.18 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో జగిత్యాల జిల్లా 99.73 ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా హైదరాబాద్ జిల్లాలో 89.09 ఉత్తీర్ణతతో చివరిస్థానంలో నిలిచింది.

రాష్ట్రంలో మొత్తం 2,125 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 21 పాఠశాలలు సున్నా ఉత్తీర్ణతను నమోదుచేశాయి. జూన్ 10 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు పదోతరగతి పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్‌ 10 నుంచి 24 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఫలితాల వెల్లడి అనంతరం విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు మే 27లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ఆయన వెల్లడించారు. 

ఈ ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించిన పదోతరగతి పరీక్షలకు మొత్తం 5.46 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరికి సంబంధించిన ఫలితాలను సోమవారం వెల్లడించారు. ఫలితాల వెల్లడి రోజు అంటే.. మార్చి 13 నుంచే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. మార్చి 27 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరకు జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*