తెలంగాణ కాంగ్రెస్ తొలి జాబితాలో టీడీపీ స్థానాలు

తెలంగాణ తొలి జాబితాలో టీడీపీ స్థానాలు, తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదే రోజున నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో 38 నియోజకవర్గాల్లో 48 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా, 65 మందితో కూడిన తొలి జాబితాను టికాంగ్రెస్ ప్రకటించింది. మహాకూటమిలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ కూడా తొమ్మిది నియోజకవర్గాల్లో తమ అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. తొలి జాబితాలో తొమ్మిది మంది టీడీపీ అభ్యర్థులను సోమవారం అర్ధరాత్రి విడుదల చేసింది. మహాకూటమిలో భాగంగా టీడీపీకి 14 సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మిగతా ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తొలి జాబితాలో సీనియర్లకే టీడీపీ ప్రాధాన్యత ఇచ్చేసింది. 

 

 

తెలంగాణ ఖమ్మం జిల్లా నుంచి మాజీ ఎంపీ, సీనియర్ నేత నామా నాగేశ్వరరావు బరిలో నిలుస్తుండగా, సుత్తుపల్లి నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు మరోసారి అవకాశం దక్కింది. ఉప్పల్ నుంచి సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్‌ దక్కించుకున్నారు. 

తెలంగాణ కాంగ్రెస్ తొలి జాబితాలో టీడీపీ అభ్యర్థులు వీరే

1.నామా నాగేశ్వరరావు – నామా నాగేశ్వరరావు

2. సత్తుపల్లి- సండ్రవెంకట వీరయ్య

3. అశ్వారావుపేట- మచ్చ నాగేశ్వర రావు

4. వరంగల్ పశ్చిమ – రేవూరి ప్రకాష్ రెడ్డి

5. మక్తల్ – కొత్తకోట దయాకర్ రెడ్డి

6. మహబూబ్ నగర్- ఎర్ర శేఖర్

7. ఉప్పల్ – వీరందర్ గౌడ్

8. శేరి లింగంపల్లి – భవ్య ఆనంద ప్రసాద్

9. మలక్ పేట్ – ముజాఫర్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*