ప్రజలు బిఎల్ఎఫ్ ను ఎంతగానో ఆదరిస్తున్నారంటున్న వీరభద్రం

ప్రజలు బిఎల్ఎఫ్ ను ఎంతగానో ఆదరిస్తున్నారంటున్న వీరభద్రం, బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బిఎల్‌ఎఫ్‌) శుక్రవారం మహబూబాబాద్‌లోని గాంధీపార్క్‌ లో బహిరంగసభ నిర్వహించింది. ఈ సభ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. ఇన్నాళ్లు పాలించిన పార్టీలు ప్రైవేటు ఆస్పత్రులకు కొమ్ముకాశారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు  ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారని తెలిపారు.

 

తమ బిఎల్ ఎఫ్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. రైతుబంధు లాగానే కూలిబంధు పథకాన్ని కూడా ప్రవేశపెడతామని ఆయన హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్నారు. ఇంకా ఇలాంటి మరెన్నో ప్రజలకు పథకాలను ప్రవేశపెడతామని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*