తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి….కన్నుమూత..!

తమిళనాడు మాజీ  సీఎం కరుణానిధి (94) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. 13సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి, ఐదుసార్లు సీఎంగా పని చేసిన ఆయన మరణంతో తమిళనాట విషాదం అలుముకుంది. డీఎంకే శ్రేణులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. ప్రజలు, నాయకుల సందర్శనార్థం ఆయన పార్థీవ దేహాన్ని రాజాజీ హాల్లో ఉంచారు. సాయంత్రం 4 గంటలకు కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. డీఎంకే అధినేత మరణం తర్వాత తమిళనాట ఏం జరుగుతుందో నిరంతర అప్‌డేట్స్ మీకోసం.. 

కరుణానిధి అంత్యక్రియల విషయంలో వివాదం చోటు చేసుకోగా.. డీఎంకే నేతలు హైకోర్టును ఆశ్రయించారు. మెరీనా బీచ్‌లోనే కరుణ అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతిస్తూ.. మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై చేరుకున్నారు. చెన్నై ఎయిర్‌పోర్టులో తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంతోపాటు పలువురు డీఎంకే నేతలు ప్రధానికి స్వాగతం పలికారు.  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరికాసేపట్లో చెన్నై రానున్నారు. తెలుగు సీఎంలతోపాటు దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు కరుణ పార్థీవ దేహానికి నివాళులు అర్పించడానికి తమిళనాడు వెళ్లనున్నరు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*