కరుణానిధితో….. తమిళ హీరో విజయ్‌ పలకరింపు..!

అనారోగ్యంతో చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని తమిళ హీరో విజయ్‌ బుధవారం పరామర్శించారు. కావేరీ ఆస్పత్రికి వెళ్లిన విజయ్‌.. కరుణానిధి కుమారుడు ఎం.కె.స్టాలిన్‌ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి ఆరా తీశారు. కరుణానిధికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధి కొద్దిరోజులుగా కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమించినట్లు వైద్యులు బులెటిన్‌ విడుదల చేయడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. అయితే మరుసటి రోజు నుంచి ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని.. చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. కరుణానిధిని పరామర్శించిన వారు సైతం ఆయన కోలుకుంటున్నారని చెబుతుండటంతో అభిమానులు, డీఎంకే కార్యకర్తలో సంతోషం నెలకొంది. మంగళవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, రజనీకాంత్‌ కరుణానిధిని పరామర్శించారు. రాహుల్‌ పరామర్శకు వచ్చిన సందర్భంలో కరుణానిధికి స్టాలిన్‌ చెవిలో ఏదో చెబుతున్నట్టు ఉన్న ఫొటో విడుదల చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*