RX 100 లో నటించినందుకే….పాపం పాయల్……!

RX 100 లో నటించినందుకే పాపం పాయల్ కి అదే తరహాలో ఆఫర్లు వస్తున్నాయి. కానీ RX 100 మూవీ సూపర్ సక్సెస్ తో దూసుకుపోతోంది. కథలో కీలకంగా మారి సినిమా ఇంతగా జనానికి రీచ్ కావడానికి మాత్రం ముఖ్య  పాత్ర పాయల్ రాజ్ పుత్ దే. నిజానికి ఇంత నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రను డెబ్యూ మూవీగా ఎవరూ ఒప్పుకోరు. కానీ పాయల్ ధైర్యం చేసింది. ఫలితం దక్కింది కానీ అది వేరే రూపంలో రావడం తో సన్నిహితులు పాపం పాయల్ అంటున్నారు. దానికి కారణం అన్ని ఇలాంటి వ్యాంపు తరహా పాత్రల ఆఫర్లు రావడమంట. RX 100 కథలో పాయింట్ ను తీసుకుని మొత్తంగా అదే తరహాలో సినిమాలో చేయమని పాయల్ ను అడుగుతున్నారట. కానీ పాయల్ వాటికి నో  చెప్తుందట ఇలాంటివి చేస్తే తనకు ఇమేజ్ పరంగా వేరే స్టాంప్ పడిపోతుంని తన ఉధ్ధేశం.

కనీసం ఏదైనా స్టార్ హీరో సినిమాలో అతిథి పాత్ర కానీ లేదా ఐటెం సాంగ్ కానీ వస్తే మెల్లగా పెద్ద ప్రాజెక్ట్స్ అవే వస్తాయని ఎదురుచూస్తోంది  పాయల్.  ఇక్కడేమో కానీ తన మాతృ బాష పంజాబీలో పాయల్ కు మంచి డిమాండ్ ఉంది. గత ఏడాది విడుదలైన చెనా మేరియా మంచి పేరే తీసుకొచ్చింది. త్వరలో విడుదల కానున్న జాన్వీ కపూర్ దఢక్ కు పంజాబీ వర్షన్ అది. హిందీలో వీర్ దే వెడ్డింగ్ లో చిన్న పాత్ర చేసింది. తమిళ్ లో ఇరువర్ ఉల్లం అనే సినిమా చేసింది. కానీ అవేవి RX 100 అంత పేరు తీసుకురాలేదు. ఇందులో కూడా సాధారణ హీరోయిన్ పాత్ర అయ్యుంటే తన  కథ వేరుగా ఉండేది. కానీ పాయల్ వేసింది మామూలు పాత్ర, కామంతో రగిలిపోయే ఇందూ గానే  యూత్ తో పాటు ఇండస్ట్రీ కథకులు అదే దృష్టితో చూస్తున్నారు. అక్కడే వచ్చింది అసలు చిక్కు. మరి తాను కోరుకున్న బ్రేక్ ఎప్పుడు వస్తుందో వేచి చూద్దాం మరి. 

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*