బొగోటా: కొలంబియాలో నిర్మాణంలో ఉన్న వంతెనను అధికారులు కూల్చివేశారు. అది ఎందుకో తెలుసా?చిరాజరా కానియన్ ప్రాంతంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు జరుగుతున్న సమయంలోనే ప్రమాదం జరిగి 10 మంది కార్మికులు మృతి చెందారు. ఆకృతి లోపం వల్లే ఇలా జరిగిందని నిర్ధారించిన అధికారులు వంతెనను కూల్చివేయాలని నిర్ణయించారు. శక్తిమంతమైన పేలుడు పదార్థాలు ఉపయోగించి వంతెనను కుప్పకూల్చారు. దీంతో 446 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి ముగింపు పలికారు.
Read More »