Tag Archives: టీఆర్ఎస్ పార్టీ

కేసీఆర్ ప్రెస్ మీట్ ఈ రోజు 4PM

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ త‌న జోరు కొన‌సాగిస్తున్న‌ది. 119 స్థానాలకు గాను 91 స్థానాల్లో టీఆర్ఎస్ ప్ర‌స్తుతం ఆధిక్యంలో కొన‌సాగుతున్న‌ది. దీంతో టీఆర్ఎస్ స్ప‌ష్ట‌మైన ఆధిక్యం దిశ‌గా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ది. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై సీఎం కేసీఆర్ ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడ‌నున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి తెలంగాణ భ‌వ‌న్‌కు 3.45 గంట‌ల‌కు కేసీఆర్ చేరుకుని అనంత‌రం విలేక‌రులతో మాట్లాడుతారు.

Read More »

కాంగ్రెస్ లీడర్స్ నిరాశ.. తెలంగాణలో దూసుకుపోతున్న కారు

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ పార్టీ దూకుడు కనబరుస్తోంది. కారు దూకుడుకు కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలు కూడా వెనుకంజలో పడ్డారు. కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి, నాగార్జున‌సాగర్‌లో జానారెడ్డి వెనుకంజలో ఉన్నారు. రేవంత్‌పై టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డి 651 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. జానారెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జనగామలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తొలుత వెనుకంజలో కొనసాగినా.. నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి స్వల్ప ఆధిక్యంలోకి వచ్చారు.  శేరిలింగంలపల్లి, కూకట్‌పల్లిలో నియోజకవర్గాల్లోనూ ...

Read More »

కూక‌ట్ ప‌ల్లి లో టిఆర్ఎస్ నాయకుల యుద్ధం

తెలంగాణ‌లో వ‌ర్గ పోరు తారా స్థాయిలో న‌డుస్తోంది. అస‌మ్మ‌తుల‌ను అదిష్టానం ఎంత బుజ్జ‌గించినా పైకి చ‌ల్ల బ‌డ్డ‌ట్టు క‌నిపిస్తున్నా లోలోన మాత్రం అగ్నిప‌ర్వ‌తంలా ర‌గిలిపోతున్నారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో తాజా మాజీ ఎమ్మెల్యేల పై బ‌హిరంగ ఆరోప‌ణ‌లు చేయ‌డంతోపాటు రాబోవు ఎన్నిక‌ల్లో ఎలా గెలుస్తారో చూస్తామంటూ స‌వాల్ విసురుతున్నారు. దీంతో ప్ర‌థ‌మ శ్రేణి నాయ‌క‌త్వం ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం మ‌ద్య ప్ర‌శ్చ‌న్న యుద్దం నెల‌కొంది. అంద‌రూ క‌లిసి పార్టీ విజ‌యం కోసం ప‌నిచేయాల్సింది పోయి పొంత పార్టీలోనే వ్య‌తిరేక గ‌ళం వినిపిస్తున్నారు నాయ‌కులు. గులాబీ పార్టీలో ...

Read More »