పెద్దన్న పాత్ర పోషిస్తున్న మహేష్.. ఎలానో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే….!

పెద్దన్న పాత్ర పోషిస్తున్న మహేష్.. ఎలానో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే….! సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఒక పెద్ద హీరో ఒక చిన్న సినిమా గురించి ట్వీట్ చేస్తే దానికి దక్కే ప్రయోజనం చాలానే ఉంటుంది. హీరోలకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉంటారు కాబట్టి వాళ్లు ట్వీట్ చేస్తే సినిమా చాలామందికి చేరుతుంది. మంచి ప్రచారం లభిస్తుంది. కానీ ఈ మాత్రం సాయం చేయడానికి కూడా సెలబ్రెటీలు తటపటాయిస్తుంటారు. ఐతే ఈ మధ్య సెలబ్రెటీల్లో కదలిక వచ్చి చిన్న సినిమాలకు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు.

ఇంతకుముందు తన సినిమాలో  లేదంటే తన బావ సుధీర్ బాబు సినిమాలకు సంబంధించిన విశేషాల్ని మాత్రమే సోషల్ మీడియాలో పంచుకుంటూ వచ్చిన మహేష్ బాబు.. ఈ మధ్య బయటి సినిమాల గురించి కూడా ట్వీట్లు చేస్తుండటం.. వాటి గురించి సానుకూల వ్యాఖ్యలు చేస్తుండటం విశేషం. ఇటీవలి కాలంలో మహేష్ తనకు సంబంధం లేని చాలా సినిమాల గురించి స్పందించాడు. టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘గీత గోవిందం’తో పాటు దాని కంటే ముందు వచ్చిన ‘గూఢచారి’ గురించి పొగడ్తలు గుప్పిస్తూ ట్వీట్లు చేశాడు.

అంతకుముందు శ్రీనివాస కళ్యాణం ట్రైలర్ లాంచ్ చేశాడు. అంతకంటే ముందు విశాల్ డబ్బింగ్ సినిమా అభిమన్యుడు గురించి కూడా ట్వీట్ చేశాడు. ఈ సినిమాలన్నింటినీ మహేష్ బాబు ఇంటి దగ్గర స్పెషల్ షోలు వేయించుకుని చూసి స్పందించడం విశేషం. మహేష్ ట్వీట్లు ఆ సినిమాలకు బాగానే ఉపయోగపడ్డాయి. మహేష్ ఇలా పెద్దన్న పాత్ర పోషిస్తుండటం శుభ పరిణామమే. గతంతో పోలిస్తే మహేష్ వేరే హీరోల్ని కలిసే విషయంలోనూ మొహమాటాలు వదిలేస్తుండటం విశేషం. అతను తరచుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను కలుస్తుండటం వాళ్ల ఫ్యామిలీలతో కూడా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*