టీడీపీ తరపున కూకట్ పల్లి అభ్యర్థిగా సుహాసినీ గ్రీన్ సిగ్నల్…!

టీడీపీ తరపున కూకట్ పల్లి అభ్యర్థిగా సుహాసినీ గ్రీన్ సిగ్నల్…!కూక‌ట్ ప‌ల్లి అంశంలో కుటుంబ స‌భ్యులు మొత్తం ఏకాభిప్రాయానికి వ‌చ్చారు. ఎట్టకేలకు కూకట్ పల్లి అసెంబ్లీ స్ధానం నుంచి పోటీ చెయ్యడానికి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని సై అంటున్నారు. బుధవారం రాత్రే సుహాసిని తన అంగీకారాన్ని తెలిపినట్లు సమాచారం. విశాఖపట్నంలో పర్యటనలో ఉన్న చంద్రబాబును కలవడానికి గురువారం ఉదయమే సుహాసిని ఆమె స్నేహితురాలు కలసి విశాఖ బయలు దేరారు. అక్కడ చంద్రబాబు నాయుడి ఆశీర్వాదం తీసుకుని రేపు హైదరాబాద్ లో కూకట్ పల్లి నియోజకవర్గానికి సుహాసిని నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తుంది.

 

ఎలాగైనా నందమూరి కుటుంబం నుంచి ఎవరినో ఒకరిని తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దింపాలని భావించిన చంద్రబాబు హరికృష్ణ కుమార్తె సుహసినిని పోటీ చెయ్యమని ఆహ్వానించారు. అయితే ఈ ప్రతిపాదనను హరికృష్ణ కుటుంబంలో ఎవరూ అంగీకరించలేదు. అయితే గతంలో చంద్రబాబు సుహాసినికి ఉన్న కొన్ని బ్యాంకు రుణాలను సర్ధుబాటు చేసినట్లు సమాచారం. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సుహాసిని పెద్ద సోదరుడు జానికిరామ్ వ్యాపార అవసరాల కోసం సుహాసిని తన అస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పు తీర్చారు. అయితే బ్యాంకు రుణాలు తీర్చలేక పోవడంతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులెవ్వరూ సహాయం చెయ్యడానికి ముందుకు రాలేదు.

 కానీ, చంద్రబాబు స్వ‌యంగా జోక్యం చేసుకుని సుహాసినిని అప్పుల ఊబి నుంచి బయటపడేశారు. ఆ కృతజ్ఞతతోనే ఇప్పుడు చంద్రబాబు అడిగిన వెంటనే కూకట్ పల్లి అసెంబ్లీ స్ధానం నుంచి పోటీ చెయ్యడానికి సుహాసిని ఒప్పుకున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా సుహాసిని ప్రాణ స్నేహితురాలు కూడా ఆమె ఎన్నికల్లో పోటీ చేసేందుకు మోటివేట్ చేసినట్లు సమాచారం. అమె గుంటూరు జిల్లాకు చెందిన ఒక నేత సోదరే సుహాసిని ప్రాణ స్నేహితురాలు. సుహాసిని ఎనికల్లో పోటీ చేయడానికి ఒప్పుకోవడానికి ఆ స్నేహితురాలే కారణమట.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*