ఆ హీరోయిన్ తో డ్యాన్స్ అంటే స్టార్ హీరోలకు భయమంట…!

 

ఆ హీరోయిన్ తో డ్యాన్స్ అంటే స్టార్ హీరోలకు భయమంట ఎవరనుకుంటున్నారా ఆమె సాయేషా సైగల్. అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీతో టాలీవుడ్ లోకి ప్రవేశించింది. ఆ సినిమా  హిట్  కాకపోవడంతో తెలుగులో అవకాశాలు రాలేదు. కానీ తమిళంలో మాత్రం వరుస హిట్స్ తో క్రేజ్ తెచ్చుకుంది. వనమగన్ మూవీ ద్వారా సైగల్ తమిళ్  లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడి స్టార్ హీరోలందరితోనూ చేసింది. ఆమెతో నటించేందుకు తమిళ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. సాయేషా మంచి డ్యాన్సర్. కథక్, ఒడిస్సీ, లాటిన్, అమెరికన్ డ్యాన్సులన్నీ నేర్చుసుకుంది.

ఎవరూ ఊహించని స్పీడుతో డ్యాన్స్ చేస్తుంది. అందుకే ఇప్పుడు ఆమెతో కలిసి డ్యాన్స్ చేయమంటే హీరోలు బెంబేలెత్తిపోతున్నారట. అంతలా ఊపేసే సైగల్ సినిమాలు లేని సమయాన్ని డ్యాన్స్ చేస్తూ ఉంటానని తెలిపింది. తెలుగు హిందీ తమిళ చిత్రాల్లో నటించానని ప్రస్తుతం తమిళంలో వరుస అవకాశాలు వస్తున్న నేపథ్యంలోనే తమిళం నేర్చుకుంటున్నానని చెప్పింది. ట్రావెలింగ్ మరియు స్విమ్మింగ్ అంటే ఇష్టమని నటిని అయినప్పటికీ పెద్దగా మార్పులేవి లేవని  తన జీవితంలో సాయేషా తెలియజేసింది.  

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*