ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేయడం కోసం రాజమౌళి తన టీమ్ తో యుద్ధం చేస్తున్నాడట…!

ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేయడం కోసం రాజమౌళి తన టీమ్ తో యుద్ధం చేస్తున్నాడట…! భారీ ఇమేజ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ ప్లాన్ చేయటం అంటే అంత ఈజీ కాదు. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే  ఈ ట్రెండ్ ఊపందుకుంటోంది. ఇప్పటిదాకా వచ్చిన వాటిలో అధిక శాతం ఇప్పుడున్న యూత్ హీరోలతో సీనియర్ స్టార్లు కాంబోగా చేసినవి తప్ప ఒకే వయసు స్థాయి ఉన్నవాళ్ళు చేసినవి కాదు. వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ వీళ్ళు చేసినవన్నీ అదే క్యాటగిరీలోకి వస్తాయి. అందుకే రాజమౌళీ బాహుబలి తర్వాత తీయబోయే సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లను హీరోలుగా ప్రకటించినప్పుడు ఆ ఊహకే అంచనాలు పీక్స్ కు వెళ్లిపోయాయి. షూటింగ్ త్వరలో మొదలుపెట్టాల్సిన తరుణంలో జక్కన్న మీద మెల్లగా ఒత్తిడి స్టార్ట్ అయ్యిందట.

అరవింద సమేత వీర రాఘవ అక్టోబర్ 11 విడుదల కాగానే తారక్ పూర్తిగా ఫ్రీ అయిపోతాడు. ఇంకెవరికి కమిట్ కాలేదు. రామ్ చరణ్ నవంబర్ లేదా మహా అయితే డిసెంబర్ మొదటి లేదా రెండో వారానికి బోయపాటి సినిమా పూర్తి చేసి ఖాళీగా ఉంటాడు. అప్పుడిక ఈ ఇద్దరి పని రాజమౌళి ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి జంటగా వెళ్లిపోవడమే. విశ్వసనీయ సమాచారం మేరకు ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేయడం కోసం రాజమౌళి తన టీమ్ తో ఓ యుద్ధమే చేస్తున్నాడట. అభిమానులకు ఏ కోణంలో నిరాశ కలిగించకుండా ఇమేజ్ పరంగా ఆ హీరోలకు ఇబ్బంది కలగకుండా ఎన్నిరకాల మార్పులు చేయాలి అనే దాని గురించి రోజూ గంటల తరబడి చర్చలు జరుగుతున్నాయని టాక్.

 

బ్రిటిష్ కాలం నాటి నేపధ్యం కాబట్టి దీనికి కూడా గ్రాఫిక్స్ అవసరమవుతాయట. అందుకే బడ్జెట్ రఫ్ గా చూసుకుంటూనే 300 కోట్ల దాకా తేలిందని సమాచారం. రాజమౌళి బ్రాండ్ తో పాటు ఈ ఇద్దరు హీరోలకున్న మార్కెట్ దృష్ట్యా అడ్వాన్స్ ఇమ్మన్నా చాలు నిర్మాత దానయ్యకు సగం పెట్టుబడి వచ్చేస్తుందని ఇప్పటికే ట్రేడ్ టాక్ ఉంది. సో ఇన్నేసి అంచనాలు ఉన్నాయి కాబట్టే రాజమౌళి చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలోనూ కేర్ తీసుకున్నట్టు తెలిసింది. డిసెంబర్ మొదటివారం లాంఛనంగా షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అధికారికంగా జక్కన్న దీని తాలూకు అప్ డేట్స్ ఏమి ఇవ్వడం లేదు. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*