నన్నుకత్తి మహేష్‌ లాగా చెయ్యొద్దు…. ప్లీజ్ కెసిఆర్ సర్: శ్రీరెడ్డి

ఇటీవల కత్తి మహేష్, స్వామి పరిపూర్ణానందని హైదరాబాద్‌ నుంచి బహిష్కరించిన విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్‌ నుంచి తనని బహిష్కరించొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ను సినీ నటి శ్రీరెడ్డి ప్రార్థించింది. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ గా‌ మాట్లాడి వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి ఆ తర్వాత ప్రముఖ నటులపై తీవ్రస్థాయిలో కంప్లయింట్లు చేసింది. కొత్తగా ఇప్పుడు ఆమె కోలీవుడ్‌లో‌ నటులను టార్గెట్‌గా చేసుకుని ఆరోపణలు చేస్తోంది. సినిమాల్లో ఆఫర్స్ ఇస్తామంటూ తనని మభ్యపెట్టిన నటుల పేర్లతో పాటు వారిని కలిసిన హోటల్‌తో సహా శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో రాసుకొస్తోంది. 

సినీ ఇండస్ట్రీలోని ఆడవాళ్ళను వాడుకున్న జాబితాలో నటులే కాదు ఇంకా రాజకీయ నేతలు కూడా ఉన్నారని తాజాగా శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. గత కొన్నిరోజులుగా తన అభ్యర్థనని వినాలని, కాస్టింగ్‌ కౌచ్‌పై చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌‌కి ఫేస్‌బుక్‌ ద్వారా విన్నవిస్తున్న శ్రీరెడ్డి మరోసారి తన బాధని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి ఈ విధంగా లేఖ వ్రాసింది.‌‌‌

గౌరవనీయులైన సీఎం కెసిఆర్ గారికి.. సార్ ఇకనైనా స్పందించండి. మేము ఎన్ని బాధలు పడాలి. డ్రగ్స్ తీసుకుంటూ, హీరోయిన్స్ తో పడుకునే వారిలో రాజకీయ నేతలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ గురించి నేను మాట్లాడను. మాట్లాడినా న్యాయం జరగదని నాకు తెలుసు. ఆపై నేను సురక్షితంగా కూడా ఉండలేననీ, వారు నన్ను చంపినా చంపేయ్యొచ్చు.  డ్రగ్స్, సెక్స్‌ రాకెట్‌లో మీ సన్నిహితులు కూడా ఉన్నారు. కాబట్టి నేను పొలిటికల్ వైపు రాదలచుకోలేదు. కానీ ప్లీజ్ సార్ ‘మా’ అసోషియేషన్, ఇండస్ట్రీలోని పెద్ద తలలు నన్ను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. మీరు తెలంగాణ రాష్ట్రానికి సిఎమ్. నా పరిస్థితి దారుణమయింది. మీరు అర్థం చేసుకుని సమస్యని పరిష్కరించి న్యాయం చేయండి. దయచేసి హైదరాబాద్‌ నుంచి నన్ను బహిష్కరించొద్దండి. నేను చెప్పినవన్నీ వాస్తవాలేననీ శ్రీరెడ్డి రాసుకొచ్చింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*