‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా రివ్యూ మరియు రేటింగ్ – ఈ పెళ్ళికి వెళ్ళచ్చా..

సినిమా పేరు : శ్రీనివాస కళ్యాణం

నటి నటులు : నితిన్, రాశి ఖన్నా, నందిత శ్వేత, ప్రకాశ్ రాజ్

దర్శకత్వం : విగ్నేష సతీష్

నిర్మాత : దిల్ రాజు

సంగీతం : మిక్కి జే మేయర్

సినిమాటోగ్రాఫర్ : సమీర్ రెడ్డి      

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై  నితిన్ హీరోగా రాశి కన్నా మరియు నందిత శ్వేత హీరోయిన్స్ గా విగ్నేష సతీష్ దర్శకత్వం వహించిన  ‘శ్రీనివాస కళ్యాణం’ గురువారం రోజు ప్రేక్షకుల ముందుకచ్చింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. దిల్ రాజు – నితిన్ కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ‘శ్రీనివాస కళ్యాణం’  ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

శ్రీనివాస్ (నితిన్) తన జాయింట్ ఫ్యామిలీకి దూరంగా చండీఘడ్ లో ఉద్యోగం చేస్తుతాడు. అక్కడ ‘కాఫీ డే’ మిడిల్ క్లాసు అమ్మాయిగా శ్రీదేవి(రాశి ఖన్నా) కనిపిస్తుంది.  కొన్ని సంఘటనల కారణంగా ఇద్దరి మద్య అది కాస్త ప్రేమగా మారుతున్న క్రమంలో శ్రీ (రాశి ఖన్నా) పెద్ద బిజినెస్ మెన్ అండ్ మల్టీ మిలినియర్ అయిన ప్రకాష్ రాజ్ కూతురు అని తెలుస్తుంది.   లైఫ్ లో టైంకి, బిజినెస్ కి తప్ప దేనికి లెక్క చేయని ఆయన్ని,  శ్రీనివాస్ శ్రీదేవితో తన పెళ్ళికి ఏలా ఒప్పించాడు ? ఆ ఒప్పుకున్నే క్రమంలో శ్రీ తండ్రి (ప్రకాష్ రాజ్) శ్రీనివాస్ కు ఓ షరతు పెడుతూ అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకుంటాడు.

అసలు ప్రకాష్ రాజ్ పెట్టిన షరతు ఏంటి? అందువల్ల వచ్చిన సమస్యలేంటి? అస్సలు శ్రీనివాస్ శ్రీదేవిలా పెళ్లి జరిగిందా? శ్రీనివాస్ తన ఫామిలీ కోరుకున్న విధముగా పెళ్లి చేసుకున్నాడు ? లాంటి విషయాలు తెలియాలంటే శ్రీనివాస కళ్యాణం చిత్రం చూడాల్సిందే

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు సతీష్ వేగేశ్న పెళ్లి నేపథ్యంలో రాసుకున్న కథే ఈ సినిమాకు ప్రధాన బలం హీరో నితిన్ లుక్స్ పరంగా గత తన చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో చాలా బాగున్నాడు. ఇక నటన విషయానికి వస్తే బరువైన కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో సంప్రదాయాలకు విలువ ఇచ్చే ‘శ్రీదేవి’ పాత్రలో కనిపించిన రాశి ఖన్నా చాలా చక్కగా నటించింది. కీలకమైన పాత్రల్లో కనిపించిన ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్, జయసుధ, ఆమని, సితార ఎప్పటిలాగే తమ నటనతో ప్రేక్షకులని మెప్పించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో ప్రకాష్ రాజ్ చాలా బాగా నటించారు.

మైనస్ పాయింట్స్ :

కథలో కొన్ని సన్నివేశాలలో తన దర్శకత్వ ప్రతిబ చుపించిన విగ్నేష కథనంలో మాత్రం కొన్ని చోట్ల నెమ్మదిగా కనిపించారు పద్మావతిగా మంచి భావేద్వేగ పాత్రలో కనిపించిన నందిత పాత్రకు కూడా సరైన ముగింపు వుండదు. ఇక కథను మలుపు తిప్పే ప్రదాన పాత్ర అయిన ప్రకాష్ రాజ్ పాత్ర మారడానికి ఇంకా బలమైన సంఘటనలు ఉండి ఉంటే ఆ పాత్రకి ఇంకా బాగా జస్టిఫికేషన్ వచ్చి ఉండేది.

చివరగా :

పెళ్లి నేపథ్యంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులను మరియు గ్రామీణ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాగా పెళ్లిని, ఆ వాతవరణాన్ని చాలా అందంగా ఆహ్లాదకరంగా చూపిస్తూ, బంధువులను వారి మధ్య అనుబంధాలను చాలా చక్కగా చూపించారు. అయినప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

Web2look Rating : 3/5

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*