స్నేహారెడ్డికి ఎందుకింత ఫాలోయింగ్?

బన్నీ కెరీర్లో కూడా కీలక పాత్ర బన్నీ వ్యక్తిగత జీవితంలో స్నేహారెడ్డి పాత్ర అత్యంత కీలకమైనది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం ద్వారా సినిమాల సైడ్ పబ్లిసిటీ పరంగా తనవంతు తోడ్పాటు అందించాలని స్నేహారెడ్డి నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది.

అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్‌తో సంబంధం లేకుండా స్నేహారెడ్డి తన ఇన్‌స్టా పోస్టులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె షేర్ చేస్తున్న పోస్టుల్లో బన్నీ, అయాన్, అర్హకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఉండటం అభిమానులను మరింత మెప్పిస్తోంది. సెలబ్రిటీ వైఫ్ హోదా తెలుగులో ఉండే స్టార్ హీరోల భార్యల్లో అతి కొద్ది మాత్రమే సినిమాలను టచ్ చేయకుండా సెలబ్రిటీ హోదా సొంతం చేసుకున్నారు. మహేష్ భార్య నమ్రత, రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ఇప్పటికే సోషల్ మీడియాలో తమ హవా కొనసాగిస్తున్నారు. నమ్రత నటి. ఉపాసన బిజినెస్ ఉమెన్. అయితే ఇవేవీ లేకుండా స్నేహారెడ్డి వారిద్దరినీ మించిపోయారు.

సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండే కథా  నాయకుల్లో అల్లు అర్జున్‌ ఒకరు. ట్విట్టర్‌లో బన్నీకి విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ బన్నీని అనుసరించేవాళ్లు ఎక్కువ. అల్లు అర్జున్‌ శ్రీమతి స్నేహారెడ్డి కూడా సోషల్‌ మీడియాలో జోరు చూపిస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు పది లక్షలమంది ఫాలోవర్స్‌ ఏర్పడ్డారు. బాలీవుడ్‌లో షాహిద్‌ కపూర్‌ భార్య మీరాకు మాత్రమే ఈ స్థాయిలో అభిమానులున్నారు. ఆ తరవాతి స్థానం స్నేహాదే.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*