మీ శరీర బరువు తగ్గాలి అంటే ఈ అంశాలను పాటించండి

అందరికి శరీర రూపురేఖల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా అమ్మాయిలు మరి ఎక్కువ. అందరూ అనారోగ్యకర ఆహార పదార్థాల వైపు శ్రద్ధచూపిస్తుంటారు.అనారోగ్యకర ఆహార పదార్థాల వలన ఊబకాయం లేదా అధిక బరువు కలుగుతుందని ఎక్కువ మందికి తెలియుదు. ఈ బరువు విషయంలో అమ్మాయిలు తమ బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ సరైన శరీరాకృతి కావాలి అనుకుంటే బరువు తగ్గించే ప్రణాళికను చాలా జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. మీ ప్రయత్నాన్ని వృధా చేసే కొన్ని అంశాలు కూడా ఉంటాయి కావున వాటిని కూడా దృష్టిలలో ఉంచుకొని, ప్రణాళికను తయారు చేసుకోవాలి. వాటిలో కొన్నిటి గురించి ఇక్కడ చర్చించబడింది.

ఆహారాన్ని సరిగ్గా తీసుకోండి

చాలా మంది అమ్మాయిలు వారు సన్నగా ఉండటానికి ఆహారాన్ని సరిగ్గా తీసుకోరు. డైటింగ్ కు బదులుగా, జంక్ ఫుడ్,సాచురేటేడ్ ఫ్యాట్, చక్కెర అధికంగా గల ఆహారాలు, వైట్ ఫ్లోర్ మరియు ఫ్రైడ్ రైస్ వంటి ఆయిల్ ఫుడ్ అనారోగ్యకర ఆహార పదార్థాలకు బదులుగా ఆరోగ్యర ఆహార పదార్థాలను తినండి. వీట్ బ్రెడ్, మొలకెత్తే విత్తనాలు, పచ్చని ఆకుకూరలు, పండ్లు మరియు నట్స్ వంటివి బరువు తగ్గించుటలో సహాయపడతాయి.

వ్యాయామాలను చేయండి

వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి మరియు బరువుకి చాలా ఉపయెగపడుతుంది. మీ శరీరానికి అనువైన వ్యాయామాన్ని ఎంచుకోండి. అధిక బరువు గల మహిళలకు వ్యాయామాల మీకు ఇష్టమైన, అనువైన వ్యాయామాలను ఎంచుకోవటం చాలా మంచిది. రోజు ఉదయం పూట ఒక్క గంట చేయండి.

మంచి నీళ్ళు ఎక్కవుగా త్రాగాలి

నీరు ఉదయానే త్రాగడం వల్ల మన శరీరాన్ని సమర్థవంతంగా మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. వ్యాయామాలు చేసే సమయంలో అధిక నీటిని తాగాలి మరియు రోజులో కనీసం 3 లీటర్ల నీటిని తాగటానికి ప్రయత్నించండి.నీరు ఎక్కవుగా త్రాగడం వల్ల ఆరోగ్యానికి మరియు బరువుని తగ్గిస్తుంది.

సరైన నిద్ర పోవాలి

అందరికి రోజులో 7 గంటల నుండి 8 గంటల సమయం పాటూ నిద్ర అవసరం. సరైన సమయం పాటూ నిద్రలేని ఎడల శరీర బరువు తగ్గించుకోవాలన్న మీ లక్ష్యం దెబ్బతింటుంది. అంతేకాకుండా సరైన సమయం పాటూ నిద్రలేకపోవటం వలన అధికంగా తినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సరైన నిద్ర లేకపోవడం వల్ల అనారోగ్యానికి గురి అవుతారు.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*