సులుభంగా బరువు తగ్గించే సహజ సిద్దమైన….ఐదు టీలు

నిజంగా టీ బరువు తగ్గడంలో సహాయం చేస్తుందా ?  నిజమనే చెప్తున్నారు కొందరు శాస్త్రవేత్తలు. నిజం చెప్పాలి అంటే టీ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది అనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో మనం మన రోజుని టీ తోనే  ప్రారంభిస్తున్నాం. అంతలా టీ మన జీవితంలో కలిసిపోయింది. అయితే మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే  మనకు తెలియకుండానే మనం తాగే టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కొన్ని రకాల టీలు మన శరీర బరువును తగ్గించడం లో ఎంతగానో సహాయపడతాయి. అవి ఏమిటో చూద్దామా!

గ్రీన్ టీ

మన అందరికీ తెలిసిన టీల్లో గ్రీన్ టీ ఒకటి. ఇది శరీరంలో ఉండే కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.గ్రీన్ టీలో జీర్ణక్రియ ని మెరుగుపరిచే  “క్యాటేచిన్స్” అనే యాంటీ-డెంట్ లను కలిగి ఉంటుంది.  అంతేకాకుండా ఇవి మన శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలను కరిగించి అందమైన  శరీరాన్ని ఇస్తుంది.

మిరియాల టీ

ఈ టీ తాగడం వలన అధికంగా తిన్న ఆహారం వల్ల వచ్చే కొవ్వును తగ్గిపోతుంది. అంతే కాకుండా మిరియాల టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మన శరీరంలో ఉండే క్యాలరీలు కర్చు చేయబడతాయి. తద్వారా మనం మన శరీర బరువును కోల్పోవడమే కాకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటాము.

సోంపు టీ

సోంపు టీ వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఈ టీ లో కొవ్వును కరిగించే ఔషదాలు ఉన్నాయి .రోజు ఈ టీ తాగడం వల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది మరియు వాంతులు, విరేచనాలు వంటి వ్యాదులను పరిష్కరించడంలో ఎంతగానో సహాయం చేస్తుంది.

నల్లటి తేయాకు టీ

ఇతర దేశాల్లో ఎక్కువగా అమ్ముడుపోయే టీ బ్లాక్ టీ. ఈ టీలో గ్రీన్ టీలో ఉన్న ఔషదాలకంటే ఎక్కువగా ఇందులో ఉన్నాయి. బరువు తగ్గడంలో గ్రీన్ టీ కంటే ఎక్కువగా పని చేస్తుంది. ఈ టీని పాక్షికంగా  పులియబెట్టిన టీ అని చెప్పవచ్చు. ఇది కొవ్వు పదార్ధాలను తగ్గించుటలో మరియు పెరగకుండా చుచుటలో సహాయ పడుతుంది.

హైబిస్కస్ టీ

హైబిస్కస్ టీ లో అనేకరకలైన ముఖ్యమైన ఔషదాలు విరివిగా ఉంటాయి.  అంతేకాక కొవ్వు పదార్ధాలను తగ్గించే మినరల్ మరియు ఫ్లావనాయిడ్’లను కలిగి ఉంటుంది. దీనివల్ల మన శరీరంలో కొవ్వు తగ్గి అందమైన శరీర ఆకృతిని కలిగి ఉంటాము.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*