రెచ్చిపోతున్న RX100.. ట్రైలర్ ను మించి.. చూస్తే షాక్……!

 

 

RX100 అసలు కథ విషయానికి వస్తే ఈ వారం కొత్తగా విడుదల చేసిన సినిమాలు రెండు తెలుగు స్ట్రైయిట్ సినిమాలు ఒక తమిళ్ డబ్బింగ్ స్టార్ హీరో సినిమా వచ్చాయి కానీ, టాక్ అఫ్ ది టౌన్ గా కేవలం RX100 మాత్రమే నిలిచింది. మెగా కాంపౌండ్ హీరో డెబ్యూ మూవీతో పాటు కోలీవుడ్ స్టార్ హీరో సినిమా ఇవేవి దీని హవాను బ్రేక్ కాదు కదా కనీసం ఝలక్ కూడా ఇవ్వలేకపోతున్నాయి. తిరిగి ఈ సినిమానే వాటికి ఝలక్ ఇస్తోంది. షేర్స్ సైతం షాక్ అయ్యేలా మూడో రోజుకే మొత్తం బడ్జెట్ వచ్చేలా చేయటం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఈ సినిమా ప్రీమియర్ షో ముందు రోజు సాయంత్రం వేసినప్పుడు డివైడ్ టాకే వచ్చింది. సినిమా బాగుందని కొందరు ఇలాంటి క్లైమాక్స్ మన తెలుగు ప్రేక్షకులు ఒప్పుకోరని ఇంకొందరు ఇలా పలురకాల కామెంట్స్ బయటికి వచ్చాయి. కానీ ఇవన్నీ ఉదయం మొదటి షో దాకా నిలవలేకపోయాయి.

అనూహ్యంగా యూత్ టికెట్ కౌంటర్ల దగ్గర బారులు తీరడం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.దేవి 70 ఎంఎం లాంటి పెద్ద థియేటర్ సైతం కూడా ఇంత చిన్న మూవీకి హౌస్ ఫుల్ కావడం యూనిట్ సైతం ఆలోచించి ఉండదు. దీనికి కారణాలు ఏoటో విశ్లేషిస్తే RX100 తక్కువ బడ్జెట్ లో రూపొందటంతో పాటు కొనుగోలుదార్లకు ఇబ్బంది లేకుండా తక్కువ రేట్లకు ఇచ్చేయడం లాంటివి ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలాగే లో బడ్జెట్ లో తీసిన ప్రతి సినిమా ఇలా భారీగా సక్సెస్ అవుతుందని కాదు. కంటెంట్ వీటన్నికంటే ముఖ్యం. ఇప్పటి యువతరంలో పెళ్లిళ్ల దాకా వెళ్లని ప్రేమలే ఎక్కువ. అందులోనూ అమ్మాయిలు హ్యాండ్ ఇవ్వడం వల్ల లవ్ ఫెయిల్ అయిన అబ్బాయిలను  లెక్కపెట్టడం కష్టం. తెలుగు సినిమాలో లీడ్ హీరోయిన్ ని నెగటివ్ షేడ్స్ లో చూపడం చాలా తక్కువ. ఇందులో ఇందూ పాత్రను రూపకల్పన చేసిన విధానం  మేము కూడా ఇలా మోసపోయామే అని యువత గుర్తు చేసుకున్న తీరు వసూళ్ల రూపంలో ఫలితాలను ఇస్తోంది. 

ఇంకా చెప్పాలంటే అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా అని ప్రేమలో పడని యువత తెలుసుకోవడానికి కూడా RX100 పోటెత్తుతుందన్నారు. దానికి జోరుగా నెల రోజుల నుంచి చాలా తెలివిగా చేసిన ప్రమోషన్ సినిమాకు బాగా ఉపయోగపడిందంటున్నారు. బోల్డ్ కంటెంట్ ని ఓపెనింగ్స్ కోసమే  హై లైట్ చేసినప్పటికీ సినిమాలో అంతకు మించిన కథే ఉందనే సంతృప్తి మూవీ  చూశాక  ప్రేక్షకులకు కలగడం వల్ల మౌత్ పబ్లిసిటీ రూపంలో పాకిపోతోంది. ఫ్యామిలీని టార్గెట్ చేయలేదు కాబట్టి, RX100 తాను కోరుకున్న సెగ్మెంట్ ని విజయవంతంగా చేరుకోగలిగింది. మూడు రోజులకే మూడు కోట్ల షేర్ దరిదాపుల్లోకి వెళ్తున్న RX100 జోరు ఇదే విధంగా కొనసాగితే బ్లాక్ బస్టర్ హిట్ దిశగా అడుగులు పడుతున్నట్టే అని సిని వర్గాల సమాచారం.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*