శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆ స్టార్ హీరో కొడుకు ఎంట్రీ ……!

కొంతమంది దర్శకులు ఏ రకమైన సినిమా రూపొందించిన మినిమం గ్యారెంటీ అనేది ఉంటుంది. ఆ దర్శకుడు తీసే సినిమాలో హీరో ఎవరు?  హీరోయిన్ ఎవరు?  అలాంటి మాటలు ఉండవు. కేవలం ఆ దర్శకుడు సినిమాకు ఓకే చెబితేనే అదో క్రేజీ ప్రాజెక్టుగా మారిపోవటమే కాదు. ఆ చిత్రంపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూ ఉంటాయి. ఆ జాబితాలో కొదరే ఉంటారు. వారిలో అలాంటి కోవకు చెందిన దర్శకుడు శేఖర్ కమ్ముల ఒకరు. యూత్ తో పాటు ఫామిలీ ప్రేక్షకుల ను ఎలా ఆకట్టుకోవాలో ఆయనకు తెలిసినంత ఎక్కువగా ఇంకెవరికీ తెలీదేమో. తాను ఏ జోనర్ మూవీ తీసినా తనదైన స్టైల్ ను  ఏ మాత్రం మిస్ కాని వైనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. యూత్ లవ్ స్టోరీలను మాత్రమే కాదు లీడర్ లాంటి  పొలిటికల్ మూవీ ఆనామిక లాంటి థ్రిల్లర్ జోనర్ లోనూ తన సత్తాను ప్రదర్శించిన ఆయన తన తర్వాతి ప్రాజెక్టును తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమారుడితో చేయనున్నారు.

మన తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన శేఖర్ కమ్ములతో స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ తదుపరి మూవీ చేయనున్నారు. ఒక సున్నితమైన ప్రేమకథను శేఖర్ కమ్ముల సిద్ధం చేశారని ఆ కథకు విక్రమ్ కుమారుడు ఓకే చెప్పేయటంతో ద్విభాషా చిత్రంగా ఈ సినిమాని చేయనున్నారు. అర్జున్ రెడ్డి మూవీని తమిళ్ లో డబ్ చేస్తున్న ధ్రువ్ తన తర్వాతి సినిమాను శేఖర్ కమ్ములతో చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, తమిళ్ లోనూ తన సినిమాలతో తనదైన ముద్ర వేసిన దర్శకుడితో ధ్రువ్ తెలుగు తెరకు పరిచయం అవ్వబోతున్నారు. ఈ ప్రాజెక్టు వివరాలు బయటకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకూ మరింత పెరుగుతున్నాయి. 2014లో నయనతారతో తీసిన అనామిక మూవీ తర్వాత తమిళ్ లో విడుదల అవుతున్న మూవీ శేఖర్ కమ్ములకి ఇదే అవ్వబోతున్నట్లుంది. మరి ఈ మూవీతో ఇద్దరికీ మరింత క్రేజ్ పెరగాలని ఆశిద్దాం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*