‘సవ్యసాచి’ సినిమా రివ్యూ మరియు రేటింగ్

సినిమా పేరు       : ‘సవ్యసాచి’

నటి నటులు       : అక్కినేని నాగచైతన్య,నిధి అగర్వాల్,మాధవన్,భూమిక,వెన్నెల కిషోర్

బ్యానర్‌           : మైత్రీ మూవీ మేకర్స్

దర్శకత్వం         : చందు మొండేటి

సంగీతం         : ఎమ్.ఎమ్.కీరవాణి  

 

మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై : అక్కినేని నాగచైతన్య హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వం వహించిన ‘సవ్యసాచి’ శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకచ్చింది. ఆ సినిమా టైటిల్ ‘సవ్యసాచి’ అని ప్రకటించినప్పుడు అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషన్లతో అంచనాలను భారీగా పెరిగాయి.నాగచైతన్య ఇమేజ్‌ను కమర్షియల్‌గా ఈ సినిమా పెంచుతుందని ఆయన అభిమానులు భావించారు. మరి దీపావళి కానుకగా నేడు(నవంబర్ 2న) విడుదలైన ఈ చిత్రం వారి అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.

కథ….

ప్రతీకారం అనే ఎమోషన్‌పై నిర్మించిన థ్రిల్లింగ్ డ్రామా ‘సవ్యసాచి’. అయితే దీనికి ‘వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్’ అనే అంశాన్ని చేర్చడం వల్ల కథకు కొత్తదనం వచ్చింది. తల్లి గర్భంలో ఏర్పిడిన కవల పిండాలు పోషకాహార లోపం వల్ల ఒకటిగా కలిసిపోవడమే ఈ లోపం. ఇదే లోపంతో విక్రమ్ ఆదిత్య(నాగచైతన్య) పుడతాడు. అయితే విక్రమ్ ఆదిత్య ఒకరు కాదు.. అతనిలో ఆదిత్య రెండో వ్యక్తి. అతను బయటికి కనిపించకపోయినా న్యూరాన్ల రూపంలో విక్రమ్ మెదడు, ఎడమ చేతిలో దాగి ఉంటాడు. అతనికి అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. వాటిని విక్రమ్ ఎడమచేతితో చూపిస్తుంటాడు. 

మరోవైపు అరుణ్ రాజ్(మాధవన్) ఎంతో మేధావి. కానీ అతన్ని ఎవరైనా విమర్శించినా, తను కావాలనుకున్నదాన్ని ఎవరైనా దూరం చేసినా తట్టుకోలేడు. వారిని చంపడానికి కూడా వెనకాడడు. అలాంటి వ్యక్తి విక్రమ్ ఆదిత్య కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. వాళ్లని అంతం చేయాలనుకుంటాడు. విక్రమ్ బావని చంపేస్తాడు. విక్రమ్‌తో అతని అక్క(భూమిక), పాపని కూడా చంపేయాలనుకుంటాడు. అసలు అరుణ్‌కు విక్రమ్ కుటుంబాన్ని చంపాల్సిన అవసరమేంటి? అరుణ్‌ను విక్రమ్ ఎలా ఎదుర్కొన్నాడు? తన అక్క, మేనకోడలిని ఎలా కాపాడుకున్నాడు? ఈ థ్రిల్లర్ డ్రామాలో చిత్ర(నిధి అగర్వాల్) పాత్రేమిటి? అనేదే సినిమా. 

ఎవరెలా చేశారంటే….

సినిమాలో రెండు పాత్రలు కీలకం. ఒకటి విక్రమ్.. మరొకటి అరుణ్. విక్రమ్ పాత్రకు నాగచైతన్య పూర్తి న్యాయం చేశాడు. ఎప్పటిలానే మంచి ఎనర్జీతో చైతూ నటించాడు. ఫైట్లు ఇరగదీశాడు. డ్యాన్స్ కూడా బాగా చేశాడు. ముఖ్యంగా ‘నిన్ను రోడ్డు మీద’ పాటలో చైతూ డ్యాన్స్ బాగుంది. ఇక అరుణ్ పాత్రలో మాధవన్ తన క్రూరత్వాన్ని చూపించారు. తెలుగులో తొలిసారి నటించిన ఈ మాజీ లవర్ బాయ్.. విలన్ పాత్రలో మెప్పించే ప్రయత్నం చేశారు. ఆయన పాత్ర మరీ గొప్పగా ఉందని చెప్పలేం కానీ.. ఉన్నంతలో బాగానే చేశారు. ఇక ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిధి అగర్వాల్.. చిత్ర పాత్రలో ఇమిడిపోయింది. ఆమె నటనలో ఎలాంటి ఇబ్బంది కనిపించలేదు. డ్యాన్సులు కూడా చాలా బాగా చేసింది. భూమిక, వెన్నెల కిషోర్, సత్య, విద్యుల్లేఖ రామన్, రావు రమేశ్, తాగుబోతు రమేశ్, షకలక శంకర్, భరత్ రెడ్డి తమ పాత్రల పరిధి మేర నటించారు.  

చివరిగా….

ఇదో వైవిధ్యమైన చిత్రం. ‘మేధావి తన తెలివిని మంచి కోసం వాడాలి కానీ, వినాశనం కోసం కాదు.. అలాంటి మేధావితనం అతన్నే నాశనం చేస్తుంది’ అనేది చిత్ర సారాంశం. వినోదం, భావోద్వేగం, యాక్షన్ ఇలా అన్ని అంశాలు ఉన్నాయి. దీనికి మంచి కథనం తోడై ఉంటే ఇంకా బాగుండేది.

Web2look : 2.5/5

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*