మూడు రోజుల్లో లాభాలు తేలనున్న అరవింద రాఘవుల బయ్యర్లు….!

 

మూడు రోజుల్లో లాభాలు తేలనున్న అరవింద రాఘవుల బయ్యర్లు….! మూడంటే మూడే రోజులు ఎప్పుడు అయిపోతాయా అని ఎదురు చూస్తున్నారు ఎన్టిఆర్ ఫ్యాన్స్. అరవింద సమేత వీర రాఘవ మొదటి షో  మరో 72 గంటల్లోపే పడనుంది. ఈ మేరకు ప్రీమియర్ల కోసం థియేటర్లు ముస్తాబు కావడం టికెట్ల కోసం అభిమానుల ఉత్సాహం ఇప్పటికే ఓ రేంజ్ లో మొదలైంది. కొంత కాలంగా టాలీవుడ్ దగ్గర భారీగా సందడి చేసిన స్టార్ హీరో సినిమా ఏదీ లేదు. దేవదాస్ అద్భుతాలు చేస్తుందేమో అని ఆశిస్తే అది కాస్తా సగటు చిత్రంగా మిగిలిపోయేదిలా సాగుతోంది. అందుకే ఈ మూవీ మీద మాములు అంచనాలు లేవు. పైగా ఈ ఏడాది చరణ్ మహేష్ లు చెరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు కాబట్టి ఆ ఇద్దరికీ మంచి స్నేహితుడైన తారక్ కూడా తన కోటా పూర్తి చేస్తాడనే అంచనాలో ఉన్నారు ఫ్యాన్స్.

 

అయితే ఈ సినిమా నిర్మిస్తున్న హారికా అండ్ హాసిని సంస్థకు ఎంత లాభం వచ్చింది అనీ ఇప్పటికే ట్రేడ్ లో రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. వాటిని విశ్లేషించి చూస్తే ఎంత లేదన్నా 40 కోట్ల దాకా విడుదలకు ముందే నిర్మాత చినబాబుకు టేబుల్ ప్రాఫిట్ వచ్చి ఉంటుందని సమాచారం. సుమారు 90 కోట్లకు పైచిలుకు థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న అరవింద సమేత వీర రాఘవకు పారితోషికాలు కలిపి బడ్జెట్ కూడా అంతే అయినట్టుగా టాక్. ఇక్కడి దాకా లాభం నష్టం అనే సమస్య లేదు. ఇవి కాకుండా శాటిలైట్ డిజిటల్ ప్లస్ డబ్బింగ్ హక్కులకు గాను మరో 40 కోట్ల దాకా అదనంగా వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. అంటే ఈ మొత్తం లాభం కిందకు వస్తుందన్న మాట.

ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయితే పైన చేసుకున్న బిజినెస్ నుంచి అదనపు లాభాలు వస్తాయి. ఈ రకంగా అజ్ఞాతవాసి టైంలో చేసిన పొరపాట్లకు తావివ్వకుండా చినబాబు జాగ్రత్తగా వహించినట్టు తెలిసింది. అజ్ఞాతవాసి సొమ్ము వెనక్కు ఇచ్చేలా దెబ్బ తీసినా శైలజారెడ్డి అల్లుడు రెవిన్యూ పరంగా పర్వాలేదు అనిపించినా అరవింద సమేత వీర రాఘవ మాత్రం మళ్ళి కుదుటపడేలా చేసిందని వినికిడి. సో ఏ రేంజ్ సక్సెస్  తో అరవింద రాఘవులు బయ్యర్లకు లాభాలు ఇవ్వబోతున్నారో మరో మూడు రోజుల్లో తేలిపోతుంది. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*