సమంత బ్రాండ్ కూరగాయలు అమ్ముతున్న సామ్.. ఎందుకో తెలుసా….!

సమంత బ్రాండ్ కూరగాయలు అమ్ముతున్న సామ్.. ఎందుకో తెలుసా….! అక్కినేని వారి కోడలు పిల్ల సమంత జస్ట్ స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు.  సినిమా షూటింగులతో – బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ తో బిజీగా ఉన్నప్పటికీ వెసులుబాటు చేసుకుని మరీ సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది.  సమంత స్థాపించిన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంది.  రీసెంట్ గా ఈ అక్కినేని కోడలు కూరగాయలు అమ్మి సంచలనం సృష్టించింది.

కురగాయలమ్మా కూరగాయలు.. నవనవ లాడే వంకాయలమ్మా.. లేత బెండకాయలు అంటూ సమంత రెగ్యులర్ గా కూరగాయాలు అమ్మేవాళ్ళు అరిచినట్టు అరవలేదు గానీ జామ్ బజార్ లో ఒక కూరగాయలమ్మే వనిత దగ్గరకు వెళ్లి నేను కూరగాయాలు అమ్మోచ్చా అని అడిగింది.  హృద్రోగం తో బాధపడుతున్న పిల్లలకు ఇలాంటి కార్యక్రమం ద్వారా డబ్బు సమకూర్చే ప్రయత్నం చేస్తున్నామని వివరించింది.  అసలే మంచి ఉద్దేశం.. పైగా సమంతా లాంటి స్టార్ హీరోయినే ఏకంగా వచ్చి అడిగితే ఎవరు కాదంటారు? ఆమె సంతోషంగా ఒప్పుకుంది. ఇక మొదలైంది ధమాకా సేల్.

అవసరమైన వాళ్ళే కాదు..అవసరం లేని వాళ్ళు.. అసలు కూరగాయలు జన్మలో ఒక్కసారి కూడా కొని ఇంటికి తీసుకెళ్ళని వాళ్ళు..  అందరూ వచ్చి సామ్ దగ్గర కూరగాయలు కొనడం మొదలు పెట్టారు. కాసేపట్లో సరుకంతా హుష్ కాకి. జస్ట్ కొనడం కాదు,  అసలు బేరమే లేదు, రేట్లు ఎంత అని కూడా అడగకుండా పెద్ద పెద్ద నోట్లు ఇచ్చిమరీ కూరగాయలు పట్టుకెళ్ళారు.   మామూలు కూరగాయలా అవి.. సమంతా బ్రాండ్ కూరగాయలు రోజూ దొరకవు కదా!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*