సమంత గ్రానీ పాత్ర …..ఎందుకో తెలిస్తే షాక్…..!

సమంత పేరు తలుచుకోగానే చూడచక్కనైన గ్లామర్ తార మనకళ్ల ముందు కదలాడుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పటి వరకు అభిమానులు ఆమెను హాట్ లేడీగా, క్యూట్ లేడీగా, అందమైన భార్యగా, చిలిపి పనులు చేసే ప్రియురాలిగా, బావను ఆటపట్టించే మరదలు పాత్రల్లో చూశాం. కానీ త్వరలో సమంత ఎవరూ ఊహించని పాత్రలో, అది కూడా 70 ఏళ్ల వృద్ధురాలిగా కనిపించబతోందట.

ప్రస్తుతం ‘యూ టర్న్‌’ అనే కన్నడ రీమేక్ చిత్రంతో నటిస్తున్న సమంత త్వరలో కొరియన్‌ సినిమా రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. అక్కడ సూపర్ హిట్ అయిన ‘మిస్‌ గ్రానీ’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారని, ఇందులో గ్రానీ పాత్రలో సమంత నటించబోతోందని టాక్.

టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించే ఈ సినిమాను ప్రముఖ తెలుగు సినీ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌ ప్రొడ్యూస్ చేయబోతోందట. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం అయితే లేదు.

2014లో వచ్చిన ఈ చిత్రాన్ని వాంగ్‌ డాంగ్‌ హ్యుక్‌ రూపొందించారు. 70 ఏళ్ల వృద్ధురాలు స్టూడియోలో ఫొటో తీయించుకుంటుంది. ఆ ఫొటో దిగిన కొన్ని రోజుల తర్వాత అచ్చం తనలాగే ఉన్న 20 ఏళ్ల యువతి కనపడుతుంది. ఆ యువతిని చూసి బామ్మ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత ఏం జరుగింది? అనే ఆసక్తికర అంశాలకు కామెడీ జోడించి రూపొందించారు.  

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*