చైతూ కోసం నమ్రతను ఫాలో అవుతున్న సమంత….!

మన తెలుగు ఇండస్ట్రీలో హీరోల భార్యలు వారి భర్తల ప్రొఫెషనల్ లైఫ్ లోను వారి సినిమాల కథల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తారు. వారు వారి భర్తలను ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉంచాలని వారి ప్రయత్నం. అలాంటి ప్రయత్నంలో మొదటిగా సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు భార్య నమ్రత ఉంది. డైరెక్టర్ల విషయంలోనూ, ప్రొడ్యూసర్ల విషయంలోనూ చాలా కటినమైన బాధ్యతను వహిస్తుంది. అందువల్లనే మహేశ్ బాబు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాలను పొందుతున్నాయి.

 ఇప్పుడు సమంత కూడా నాగ చైతన్య సినిమాల  విషయంలో నమ్రత బాటలోనే నడుస్తుంది. సమంత తను వ్యక్తిగతంగా చైతూ సినిమాల విషయంలో తన అనుమతి తోనే సినిమా ప్రాజెక్ట్స్ మీద సంతకం ఉంటుంది. తను తన అవసరం సినిమాలకు ఎంతో ప్రాముక్యత ఉందని తెలిసి కూడా వాటిని కట్ చేసి మరీ చైతూని ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉండేలా చూడటానికి ప్రయత్నం చేస్తుంది. అందుకు చాలా జాగ్రత్తలు పాటిస్తుంది.

అంతేగాక, తను ఇంకో పెద్ద బాధ్యతను తనపై వేసుకుంది. తన అత్తగారింటి పేరుని నిలబెట్టేలా అన్నపూర్ణ స్టూడియోస్ ని తీర్చిదిద్దాలని తన ప్రయత్నం. ఆ విషయంలో  కీలకమైన పాత్రను పోశిస్తున్నట్లు సమాచారం. ఇంతేగాక తన సమయం ఎక్కువ మొత్తాన్ని ఈ రెండు విషయాలలోనే గడిపేస్తుందట. సామ్ తన ప్రయత్నం లో గెలవాలని ఆశిద్దాం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*