స్టార్ హీరో కొడుకుతో రొమాన్స్ చేయనున్నసాయి పల్లవి….!

స్టార్ హీరో కొడుకుతో రొమాన్స్ చేయనున్నసాయి పల్లవి….! శేఖర్ కమ్ముల సాయిపల్లవి కాంబినేషన్ లో వచ్చిన ఫిదా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. సాయి పల్లవి క్యూట్ నైజాం యాక్సెంట్ కి ఆంధ్రా బోయ్స్ సైతం ఫిదా అయిపోయారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హిట్టవ్వటానికి అది కలిసొచ్చింది. అందుకే ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందని తెలుస్తోంది. కమ్ముల మరోసారి సాయి పల్లవికి అదిరిపోయే లవ్ స్టోరిని వినిపించారట. అతడు వినిపించిన స్క్రిప్టుకి స్టన్నయిపోయిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ వెంటనే ఓకే చెప్పేసిందని తెలుస్తోంది.

ఇంతకీ ఈ చిత్రంలో కథానాయకుడు ఎవరు? అంటే ఇదిగో ఆన్సర్. గత కొంతకాలంగా శేఖర్ కమ్ముల ప్రారంభించే కొత్త సినిమా గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆయన దర్శకత్వంలో చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ నటించబోతున్నాడంటూ ప్రచారమవుతున్న విషయం తెలిసిందే. సాయి పల్లవిని కమ్ముల ఎంపిక చేసుకున్నది ఈ సినిమాకోసమేనట. ఈ అమ్మడు విన్న స్క్రిప్టు ప్యూర్ లవ్ స్టోరి. ధ్రువ్ – సాయి పల్లవి జంట లైలా-మజ్ను రేంజ్ పరిపూర్ణమైన ప్రేమకథా చిత్రంలో కనువిందు చేయబోతున్నారని తెలుస్తోంది. ఈపాటికే కమ్ముల సైలెంటుగా ప్రీప్రొడక్షన్ పనుల్ని ప్రారంభించారని తెలుస్తోంది.

 తెలుగు మ్తమిళ్ లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలో అవకాశం ఇప్పిస్తానంటూ ఓ ఫేక్ అసిస్టెంట్ కమ్ములను నానా తిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. అతడిపై కమ్ముల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమస్య తీరిపోయిందని చెబుతున్నారు. ప్రస్తుతం ధ్రువ్ అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ లో నటిస్తున్నాడు. వర్మ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత బాలా దర్శకత్వం వహిస్తున్నారు. తర్వాత కమ్ములతో సెట్స్ పైకి వెళతాడట!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*