త్వరలో ‘RX 100’ బ్యూటీ రెండో మూవీ.. ప్రముఖ నిర్మాత మూవీలో అవకాశం….!

త్వరలో ‘RX 100’ బ్యూటీ రెండో మూవీ.. ప్రముఖ నిర్మాత మూవీలో అవకాశం….!ఈమధ్య టాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాల్లో సంచలన విజయం సాధించిన వాటిలో ‘RX 100’ ను మనం తప్పని సరిగా చెప్పుకోవాలి.   వర్మ స్కూల్ నుండి వచ్చిన దర్శకుడు అజయ్ భూపతి తన తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించడమే కాకుండా పెట్టుబడికి ఆరు రెట్ల రాబడి తీసుకొచ్చి ట్రేడ్ వర్గాలను షాక్ కు గురిచేసింది.  దీంతో ఈ సినిమా డైరెక్టర్ తో పాటు హీరో – హీరోయిన్లకు క్రేజ్ భారీగా పెరిగింది.

ముఖ్యంగా ఈ సినిమాలో బోల్డ్ అవతారంతో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో చెలరేగిపోయిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు భారీగా ఆఫర్లు వస్తున్నాయట.  కానీ ఈ భామ కంటెంట్ ఉన్న పాత్రల కోసం చూస్తూ చాలా జాగ్రత్తగా తన కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలని డిసైడ్ అయిందట.  తాజాగా  పాయల్ తన రెండో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.  భాను శంకర్ దర్శకుడిగా తెరకెక్కనున్న ఈ సినిమా ఈనెలలోనే సెట్స్ పైకి వెళ్తుందట. ‘RX 100’ లో తన పాత్రకు పూర్తిగా భిన్నంగా ఉండే పాత్రలో ఈ సారి పాయల్ కనిపిస్తుందని అంటున్నారు. 

 

 

ఈ సినిమాలో పాయల్ కు యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఉన్నాయట.  ఇక పాయల్ రెండో సినిమా సంగతులు ఇలా ఉంటే.. మరో సినిమాకు కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.  స్టార్ ప్రొడ్యూసర్ C. కళ్యాణ్ నిర్మించబోయే తాజా సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చిందట.  ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడవుతాయి. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*