‘RX100– An Incredible love story’ తెలుగు సినిమా రివ్యూ మరియు రేటింగ్ :

నటీనటలు:  వర్గంకార్తికేయ, పాయల్ రాజ్‌పుత్, రావు రమేష్, రాంకీ

దర్శకత్వం : అజయ్ భూపతి

శైలి : Action,Romance

వ్యవధి: 152

విమర్శుకుల రివ్యూ :

తెలుగులో ఇప్పటి వరకు చాలా ప్రేమకథా చిత్రాలు ప్రేక్షకుల వచ్చాయి. వాటిలో కొత్తగా, కొంచెం వెరైటీగా ఉన్న చాలా సినిమాలును  ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ‘తొలిప్రేమ’, ‘ఇడియట్’, ‘ఆర్య’, ‘అర్జున్ రెడ్డి’ లాంటి ప్రేమకథలు యువతకు బాగా నచ్చేశాయి. కానీ ఈ ‘RX100’ వీటితో పోలిస్తే కొద్దిగా భిన్నమైనది. శృతిమించే శృంగారం, భయపెట్టే హింస, మనసును హత్తుకునే అందమైన పాటలు.. అవే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. హీరోహీరోయిన్లు కొత్త వాళ్లే అయినా ప్రేక్షకుడి దృష్టిని తన వైపు తిప్పుకుంది ఈ ‘RX100’. ఇంతకీ సినిమా ఎలా ఉంది.. చూద్దాం..

శివ (కార్తికేయ)కు తల్లిదండ్రులు లేరు. అతన్ని డాడీ (రాంకీ) పెంచి పెద్ద చేస్తాడు. విశ్వనాథం (రావు రమేష్) ఊళ్లో పెద్ద మనిషి మరియు జిల్లా స్థాయి రాజకీయ నాయకుడు కూడా. అతని కూతురు ఇందు (పాయల్) బెంగళూరులో ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని సెలవులకు ఇంటికస్తుంది. ఇలా ఒక రోజు శివను చుసిన ఇందు తొలి చూపులోనే అతన్ని ఇష్టపడుతుంది. ఇందుకు కొంచెం చొరవ ఎక్కువ. అందుకే అస్సలు ఆలస్యం చేయకుండా తన ప్రేమను శివకు చెప్పేస్తుంది. తనతో పెళ్లికి ముందే అన్నీ కానిచ్చేస్తుంది. కానీ అనుకోకుండా ఇందుకు అమెరికాలో స్థిరపడిన అబ్బాయితో పెళ్లయిపోతుంది. అప్పటి నుంచి మూడేళ్లు అసలు శివకు ఇందు కనిపించదు. ఇందు ఎప్పటికైనా వస్తుందని శివ ఎదురుచూస్తూనే ఉంటాడు. అసలు ఇందు తిరిగి వచ్చిందా..? శివను అంతగా ప్రేమించిన ఇందు వేరే పెళ్లి ఎందుకు చేసుకుంది..? మరి చివరికి శివ ఏమయ్యాడు..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

తొలి భాగం చూస్తున్నంతసేపు ఇది మామూలు సినిమానే అనిపిస్తుంది. కానీ ప్రీ క్లైమాక్స్‌కు వచ్చేసరికి ఏం సినిమారా..! అనకమానరు. సెకండాఫ్‌ను దర్శకుడు అంత బాగా తెరకెక్కించారు. వాస్తవానికి సినిమాను నిలబెట్టే ట్విస్ట్ ఒకటి సెకండాఫ్‌లో వస్తుంది. ఒక నిజజీవిత సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సినిమా ఆఖర్లో తెరపై వేశారు. శివ అనే వ్యక్తి కథ అని ఆయన ఫొటో కూడా చూపించారు. ఈ కథ నిజమా అని తెలుసుకున్న ప్రతి ప్రేక్షకుడి గుండె బరువెక్కక మానదు. సెకండాఫ్ చూసిన తరవాత.. ఫస్టాఫ్‌లో చూపించిన రొమాన్స్ నిజమే కదా అనిపిస్తుంది. ఫస్టాఫ్ ప్రేక్షకుడికి కాస్త బోర్ కొట్టించినా.. సెకండాఫ్ మాత్రం కచ్చితంగా నచ్చుతుంది. ముఖ్యంగా యువతకు మంచి కిక్ ఇచ్చే సినిమా ఇది. 

ఎవరెలా చేశారంటే.. 

ఈ సినిమా తో ప్రేక్షకులకు పరిచయమైన కార్తికేయలో  హీరోకి ఉండాల్సిన ఫిజిక్, మేనరిజం కార్తికేయలో ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. నటన కూడా బాగానే ఉంది. కొద్దిగా డైలాగ్ డెలివరీ విషయంలో మెరుగు పడాల్సి ఉంది. ఇక సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ గురించి. హిందీ సీరియల్ నటి అయిన పాయల్‌కు తెలుగులో ఇదే తొలి సినిమా. అయినప్పటికీ అద్భుతంగా నటించింది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్లలో చంపేసింది. హీరోయిన్ తండ్రి పాత్రలో రావు రమేష్ నటన ఎప్పటిలానే చాలా బాగుంది. రాంకీ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. 

చివరిగా.. 

సినిమా అందరికీ నచ్చుతుందని చెప్పలేం.. కానీ యువతకు మాత్రం కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇదో కొత్తరకం విఫల ప్రేమకథ.

Web2look Rating : 2.5/5

 

 

 

 

 

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*