‘గూఢచారి’ సినిమా వల్ల ఫీల్ అవుతున్న రీతు వర్మ.. ఎందుకో తెలుసా….!

ఒక సినిమా హిట్ అవుతుందని స్క్రిప్ట్ దశలోనే గుర్తించగలగడం ఆషామాషీ విషయం కాదు.  అదే తెలిస్తే ఈ పాటికి టాలీవుడ్ లో చాలామంది సినీ పెద్దలు తమ పుత్ర రత్నాలను పెద్ద స్టార్లను చేసి ఉండేవారు.  అది అంత సులభం కాదు కాబట్టే హిట్ డైరెక్టర్లు – రైటర్ల వెంట పడతారు.  మరి అలాంటి వారికే సూపర్ హిట్ స్క్రిప్ట్ ను గుర్తించడం కష్టమైనప్పుడు అప్ కమింగ్ యాక్టర్ల పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు.   ఇప్పుడు అలాంటి పరిస్థితే ‘పెళ్లిచూపులు’ హీరోయిన్ రితు వర్మ కు ఎదురైందట.

రీతు వర్మ ‘పెళ్లిచూపులు’ సక్సెస్ తర్వాత ‘కేశవ’ లో నటించినా పెద్దగా బ్రేక్ రాలేదు.  దీంతో కోలీవుడ్ కి మకాం మార్చింది. అక్కడ వరస సినిమాలతో బిజీగా మారింది.  ఈ సమయంలో అడివి శేష్ సినిమా ‘గూఢచారి’ లో హీరోయిన్ అవకాశం వచ్చిందట.  మొదట్లో ‘యస్’ చెప్పినా ఆ తర్వాత చివరి నిముషంలో సినిమా నుండి తప్పుకొని ‘గూఢచారి’ టీమ్ కి షాక్ ఇచ్చిందట.  ‘గూఢచారి’ టీమ్ ఎలాగో మిస్ ఇండియా శోభిత ధూళిపాళ ను రితు వర్మకు రీప్లేస్మెంట్ గా తీసుకున్నారు.  ఆ తర్వాత సినిమా రిలీజ్ కావడం – సూపర్ హిట్ కావడం – ప్రశంసలు లభించడం అంతా మనకు తెలిసిందే.  హీరోయిన్ రోల్ చిన్నదయినా స్టొరీలో ప్రాముఖ్యత ఉన్న పాత్ర.  దీంతో శోభితకు మంచి రికగ్నిషన్ లభించింది. 

ఇలాంటి సూపర్ హిట్ సినిమాను మిస్ కావడం రితును నిరాశకు గురిచేసిందని టాక్.   మరి ఎందుకు ఆమె ‘గూఢచారి’ కి హ్యాండ్ ఇచ్చినట్టో?  సినిమాలో అంత విషయం లేదనుకుందా లేదా ఘాటు కిస్సులు వద్దనుకుని వెనక్కు తగ్గిందా? కారణమేదైనా జాక్ పాట్ మిస్సయినట్టే!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*