హద్దులు లేకుండా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు….!

హద్దులు లేకుండా పెరుగుతున్న పెట్రోలు డీజిల్ ధరలు….! ఆయిల్ మార్కెట్ కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరలను మరోసారి సవరించాయి. దీంతో సోమవారం (అక్టోబరు 8) దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 21 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.82.03కి చేరింది. డీజిల్ ధర 25 పైసలు పెరిగి రూ.73.82కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబాయ్ లోనూ లీటర్ పెట్రోలు ధర 21 పైసల మేర పెరిగిన పెట్రోలు ధర రూ.87.29 గా నమోదైంది. డీజిల్ ధర 31 పైసలు పెరిగి రూ.77.37కి చేరింది. 

ఇకపొతే మన తెలుగు రాష్ట్రాలలో హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 22 పైసలు పెరిగి రూ.86.96, డీజిల్ ధర 42 పైసలు పెరిగి రూ.80.40గా ఉంది. విజయవాడలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.85.80, డీజిల్ ధర రూ.78.71గా ఉంది. 

అక్టోబరు 8న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు: 

నగరం పెట్రోలు ధర (లీటర్) డీజిల్ ధర (లీటర్)
ఢిల్లీ రూ.82.02 రూ.73.82
ముంబయి రూ.87.50 రూ.77.37
కోల్‌కతా రూ.83.85 రూ.75.68
చెన్నై రూ. 85.31 రూ.78.09
బెంగళూరు రూ.82.73 రూ.74.24
హైదరాబాద్ రూ.86.98 రూ.80.42
విజయవాడ రూ.86.02 రూ.79.01

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*