సైరా సెట్స్ ని కూలదోశిన రెవెన్యూ అధికారులు.. ఎందుకో తేలిస్తే షాక్….!

సైరా సెట్స్ ని రెవెన్యూ కూలదోశిన అధికారులు.. ఎందుకో తేలిస్తే షాక్ అవ్వక మానరు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్  శేరిలింగంపల్లి ప్రాంతంల్లో జరుగుతుంది. మెగాస్టార్ సహా ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. అయితే సైరా టీమ్ కి ఊహించని షాక్ ఇచ్హారు రెవెన్యూ అధికారులు.

సైరా సెట్స్ ని రెవెన్యూ అధికారులు కూలదోశారు. అనుమతి లేకుండా చిత్రీకరణ సాగిస్తున్నారని నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న పని ఇదని అధికారులు చెబుతున్నారు. అయితే నిర్మాతల తరపున వర్షన్ వేరేలా చెబుతున్నారు. ఆ భూమిని యజమాని నుంచి లీజుకు తీసుకుని అందులో షూటింగ్ చేస్తున్నామని చెబుతున్నారు. వాస్తవానికి ఇదే లాండ్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం  షూటింగ్  కూడా చేశారు.  మరి ఇది ఎవరిదో కోర్టే నిర్ణయిచాల్సి ఉంటుంది.

ప్రస్తుతం అక్కడే ఎటువంటి అనుమతి తీసుకోకుండా సైరా చిత్రీకరణ సాగిస్తున్నారని అధికారులు ఆరోపణ చేస్తున్నారు. ఇది వివాదాస్పద భూమి ఇంకా కోర్టులో కేసు వాయిదాలోనే ఉంది. షూటింగ్ పేరుతో ఫిలింమేనేజ్ మెంట్ వాళ్లు ఆక్రమించాలని చూస్తున్నారు. అందుకే గ్యాప్ లేకుండా ఇక్కడే చిత్రీకరణ సాగిస్తున్నారని రెవెన్యూ అధికారులు ఆరోపించడం సంచలనమైంది. ఇలా అక్రమంగా ఆక్రమించుకున్న లాండ్ లో ఈ చిక్కులతో చిత్రీకరణ కొనసాగదని అర్థమవుతుంది.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*