రేవంత్ రెడ్డి పరాజయానికి 100కోట్లు

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి తర్వాత కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి కేసీఆర్, అతని కుటుంబ సభ్యుల పై తరచూ తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ నాయకుల్లో కేసీఆర్ ను విమర్శించాలంటే రేవంత్ రెడ్డి తర్వాతే ఎవరైనా,ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రధాన లక్ష్యంగా విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి తాను బరిలో దిగుతున్న కొడంగల్ నియోజకవర్గంలో తనను ఓడించేందుకు కుట్ర జరుగుతుంది అని, అందుకోసం 100 కోట్లు సిద్ధం చేసారని మొదటి నుండి చెప్తూ వస్తున్నారు.

తాజాగా కొడంగల్ నియోజకవర్గంలో పోలీసుల తనిఖీలో తెరాస నేతల ఇంట్లో డబ్బు దొరికింది.తెరాస నేతల ఇంట్లో జరిగిన తనిఖీల్లో 15కోట్ల నగదు, 25కోట్ల మేర నగదు పంపిణి స్లిప్పులు లభించాయని తనకు సమాచారం అందిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ తనిఖీల్లో తానూ మొదటి నుండి చెప్తున్నదే నిజమైందని అన్నారు. తనను ఓడించటం చేతకాని కేసీఆర్ ఇలా మొండిగా వెళ్తున్నారని, డబ్బు దొరికిన కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*