నా పేరు చెప్పడానికి భయపడ్డ కేసిఆర్

ఈ రోజు తెలంగాణా లోని టీకాంగ్రెస్ ముఖ్య నేత రేవంత్ రెడ్డిని అరెస్ట్ చెయ్యడం ఒక్కసారిగా అక్కడి రాజకీయాల్లో కలకలం రేపింది.దీనితో రేవంత్ యొక్క అభిమానులు కొడంగల్ లోని తీవ్ర స్థాయిలో వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.అయితే అనేక అనుమానాలు వస్తున్న సమయంలో రేవంత్ రెడ్డిను పోలీసులు తమ కస్టడీ నుంచి విడుదల చేశారు.ఇప్పటికే రేవంత్ రెడ్డికి తెరాస పార్టీ అన్నా కెసిఆర్ కుటుంబం అన్నా తారా స్థాయిలో మండిపడతారు.ఈ రోజు వారు చేసినటువంటి పనికి గాను రేవంత్ నిర్వహించినటువంటి సభలో కెసిఆర్ మరియు కేటీఆర్ ల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ రోజు కొడంగల్ కెసిఆర్ పాల్గొన్న సభలో కనీసం తన పేరు చెప్పడానికి కూడా భయపడ్డాడని,ఒకవేళ గాని చెప్పి ఉంటే కొడంగల్ ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో తెలిసేది అని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు.అదే సందర్భంలో కేటీఆర్ తనకి సవాళ్లు విసురుతున్నాడని,సరే నేను దానికి సిద్ధమే అమరవీరుల స్థూపం దగ్గరే మనమిద్దరం కూర్చుందాం,ఏ అంశం పై అయినా సరే తాను కేటీఆర్ తో చర్చకు సిద్ధమే అని రేవంత్ కేటీఆర్ కు ప్రతి సవాలు విసిరారు.ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది అని వస్తే ఇద్దరం కలిసి ఏ అంశం మీద అయినా సరే చర్చించేందుకు తాను సిద్ధం అని రేవంత్ సంచలనం సృష్టించారు.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*