ఎన్నికల ఫలితాలపై పార్టీ నేతలతో చర్చ: రేవంత్ రెడ్డి

ఎన్నికల ఫలితాలపై పార్టీ నేతలతో చర్చిస్తామంటూ, ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కొడంగల్‌ అభ్యర్థి రేవంత్‌ స్పందించారు. ఓటమిని తాము అంగీకరిస్తున్నామంటూనే టీఆర్ఎస్ పై తనదైన శైలిలో ఆరోపణలు చేశారు. ఈ మేరకు కొడంగల్‌లో ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలపై పార్టీ నేతలతో కూర్చుని చర్చిస్తామని రేవంత్‌ అన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయా? టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడిందా? అనే విషయాలు సమగ్రంగా చర్చిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజలు టీఆరెస్ కి అనుకూలంగా ఉన్నట్లు ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన ఉండి పోరాడతామని తెలిపారు.

 

ప్రజా సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తడంతో పాటు సలహాలు, సూచనలు ఇస్తామన్నారు. 1956 నుంచి జరిగిన వివిధ ఎన్నికల్లో 45 నుంచి 50 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ గెలుపోటములను ఒకే విధంగా తీసుకుంటుందన్నారు. గెలుపును రాష్ట్రాన్ని దోచుకోవడానికి, కుటుంబ ఆధిపత్యానికి ప్రజలు ఇచ్చిన లైసెన్స్ గా భావించొద్దంటూ టీఆర్ఎస్ కి చురకలంటించారు. అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. రైతుల ఆత్మహత్యలు ఆపేవిధంగా సంక్షేమాన్ని కొనసాగించాలని తెలిపారు.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*