వర్మ కొత్త చిత్రం ‘రెడ్డిగారు పోయారు’

reddy-garu-poyaru

 

రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రం గురించి మట్లాడుతూ  “ఓ చిన్న రాయిని నీళ్లలో వేస్తే..అది చిన్న చిన్న అలలను మాత్రమే సృష్టిస్తుంది. కానీ అదే రాయిని నిలకడగా ఉన్న రాజకీయ నీళ్లలో వేస్తే ఏకంగా సునామీనే సృష్టిస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ఓ ముఖ్య నేత (Y.S.రాజశేఖర్ రెడ్డి)  పోయాక ..ఎలాంటి పరిణామాలు సంభవించాయనే కథతో ఓ సినిమా చేస్తున్నా” అని అంటున్నారు  దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. “రాజకీయాలపై అంత ఆసక్తి లేకపోయినా..కుటిల రాజకీయుల సైకాలజీని స్టడీ చేసే ఆసక్తి మాత్రం నాలో ఎప్పుడూ ఉంది. ఓ మహానాయకుడు పోయాక..అనేక స్కాములు, మీడియా యుద్ధం..నన్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. వీటి ఆధారంగానే కల్పిత కథను ఈ సారి ఏన్నుకోవడం జరిగింది . ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలోని సినిమా కథ ఇది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు నడుస్తున్నాయి. ‘డిపార్ట్‌మెంట్’ పూర్తయ్యాక..వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని  సెట్స్‌ పైకి కెళతాం” అన్నారు.

reddy-garu-poyaru

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*